Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ తో పెళ్లి వార్తలపై హీరో సీరియస్‌

By:  Tupaki Desk   |   28 Nov 2018 4:08 AM GMT
హీరోయిన్‌ తో పెళ్లి వార్తలపై హీరో సీరియస్‌
X
మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్‌ - దర్శకుడు విజయ్‌ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి పెళ్లి ఎక్కువ కాలం నిలువలేదు. ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్న వారు విభేదాల కారణంగా విడిపోయారు. విడాకులు తీసుకున్న వారిద్దరు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సమయంలోనే అమలా పాల్‌ పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమలా పాల్‌ విడాకుల సమయంలో ఒక పెళ్లి అయిన హీరోతో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలకు కొనసాగింపు పుకార్లు వస్తున్నాయి.

తమిళ హీరో విష్ణు విశాల్‌ ఈమద్య తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈయన అమలాపాల్‌ ను వివాహం చేసుకునేందుకు భార్యకు విడాకులు ఇచ్చాడని - త్వరలోనే అమలా పాల్‌ విష్ణు విశాల్‌ లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక తమిళ మీడియా సంస్థలో కథనం వచ్చింది. దాంతో ఆ వార్త కాస్త తమిళ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో వైరల్‌ అయ్యింది. అమలా పాల్‌ తో వివాహం అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై విష్ణు సీరియస్‌ అయ్యాడు.

మీడియా వారు కాస్త బాధ్యతయుతంగా వార్తలు రాయాలని - మనకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా అనే విషయాన్ని గుర్తించి వార్తలు రాస్తే బాగుంటుంది. ఇలాంటి స్టుపిడ్‌ వార్తలను ఆపేయండి అంటూ పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈమద్య ‘రాచ్చసన్‌’ అనే చిత్రంలో విష్ణు విశాల్‌ మరియు అమలా పాల్‌ లు కలిసి నటించారు. అప్పుడే భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ పుకార్లు మరింతగా ఎక్కువ అయ్యాయి. అయితే విష్ణు ఆ వార్తలను కొట్టి పారేయడంతో ఆ చర్చకు తాత్కాలికంగా ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లే అనుకోవచ్చు.