Begin typing your search above and press return to search.
విష్ణు ప్లాన్ మంచిదే.. వర్క్ అవుట్ కాలేదు!
By: Tupaki Desk | 24 March 2019 6:46 AM GMTమంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'ఓటర్'. ఈ చిత్రం నిజానికి 2017 లోనే రిలీజ్ కావలిసి ఉంది. షూటింగ్ మొత్తం పూర్తయినా ఇంకా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ లోనే ఉంది. ఎన్నికల సీజన్ కాబట్టి రాజకీయాల నేథ్యంలో తెరకెక్కిన 'ఓటర్' కు డిమాండ్ ఉంటుందని భావించి ఏప్రిల్ లోనే ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు విష్ణు రెడీ అయ్యాడు. కానీ ప్రస్తుతం అందరి ఫోకస్ ఎలెక్షన్స్ మీదే ఉంది కాబట్టి 'అర్జున్ సురవరం' లాంటి ఇతర చిత్రాలు కూడా ఎలెక్షన్స్ పూర్తయ్యాక రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు బయ్యర్లు కూడా ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమలను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదట.
అసలే మంచు విష్ణు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. పైగా అన్ సీజన్ కావడంతో 'ఓటర్' రైట్స్ కోసం బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదట. ఇది గుర్తించిన 'ఓటర్' నిర్మాతలు ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రమోషన్స్ కూడా ఆపేశారు. ఈ లెక్కన 'ఓటర్' మరోసారి వాయిదా పడ్డట్టే. ఇప్పటికే విడుదల చాలా ఆలస్యం అయిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడడం సినిమాపై నెగెటివిటీని పెంచేదే.
ఒకసారి ఎలెక్షన్స్ పూర్తయితే సమ్మర్ చిత్రాల జాతర మొదలవుతుంది కాబట్టి ఓటర్ కు స్లాట్ దొరకడం కూడా కష్టమే. చూస్తుంటే 'ఓటర్' మేకర్స్ మరోసారి మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారనిపిస్తోంది. ఈ 'ఓటర్' కు మంచిరోజులు ఎప్పుడొస్తాయో..!