Begin typing your search above and press return to search.

ఆమెకు అఖిల్ ను చూస్తే నలిపేయాలి అనిపిస్తుందట

By:  Tupaki Desk   |   16 Nov 2022 10:30 AM GMT
ఆమెకు అఖిల్ ను చూస్తే నలిపేయాలి అనిపిస్తుందట
X
అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ హీరోగా పరిచయం అవ్వక ముందు నుండే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హీరోగా ఇప్పటి వరకు సరైన కమర్షియల్‌ బ్రేక్‌ దక్కకున్నా కూడా వరుసగా సినిమాలు అయితే చేస్తూ తన అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అఖిల్‌ అభిమానుల గురించి మాట్లాడుకున్న ప్రతి సారి యాంకర్ విష్ణు ప్రియ పేరు ప్రధానంగా ప్రస్థావనకు వస్తుంది.

విష్ణు ప్రియకు అఖిల్‌ అంటే అమితమైన అభిమానం అనే విషయం తెల్సిందే. ఎన్నో సందర్భాల్లో అఖిల్ అంటే తనకు ఉన్న ప్రేమ మరియు అభిమానం ను చెప్పే ప్రయత్నం చేసింది. తాజాగా మరోసారి ముద్దుగుమ్మ విష్ణు ప్రియ తనకు అఖిల్‌ అంటే ఉన్న అభిమానంను చెప్పకనే చెప్పింది.

జీ తెలుగు లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు యాంకర్ ప్రదీప్‌ నీ క్రష్ ఎవరు అంటూ అడిగిన సమయం లో ఏమాత్రం తడుముకోకుండా అఖిల్ అక్కినేని నా క్రష్ అంటూ సమాధానం చెప్పింది. అంతే కాకుండా అఖిల్‌ అంటే తనకు ప్రాణం అన్నట్లుగా కూడా పేర్కొంది.

అఖిల్‌ కనిపిస్తే నలిపి వేయాలి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందని.. అతడిని చూస్తూ ఉండలేను అన్నట్లుగా విష్ణు ప్రియ సిగ్గు పడుతూ కామెంట్స్ చేసింది. సోషల్‌ మీడియాలో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

బాబోయ్ మరీ నలిపేసేంత అభిమానం ఉన్న అభిమానిని కలిగి ఉన్నందుకు అఖిల్‌ అక్కినేని భలే అదృష్టవంతుడు అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరో సారి అఖిల్‌ అక్కినేని గురించి విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.