Begin typing your search above and press return to search.
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా విశ్వక్ 'పాగల్' స్పీచ్..!
By: Tupaki Desk | 13 Aug 2021 1:30 AM GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశ్వక్ సినిమాలకు కొందరు అభిమానులుగా మారితే.. అతని యాటిట్యూట్ కి వ్యవహార శైలికి మరికొందరు ఫ్యాన్స్ గా మారారు. స్టేజి మీద ఇంటర్వ్యూలలో మనసుకు ఏది అనిపిస్తే అది ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు విశ్వక్. అప్పుడప్పుడు ఈ మాటలు లేని తలనొప్పులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 'పాగల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ తో విశ్వక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.
నరేష్ కొప్పలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ''పాగల్''. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'పాగల్' సూపర్ హిట్ అవుతుందని.. కరోనా కారణంగా మూతపడిన థియేటర్లను ఈ సినిమాతో ఓపెన్ అయ్యేలా చేస్తానని అన్నాడు.
'పాగల్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమా ఫైనల్ కాపీ చూశాను. బొమ్మ అదిరిపోయింది. శనివారం నాడు పబ్బులు, బార్లలోనే కాదు సినిమా ఆడే థియేటర్లలో కూడా పార్టీలు జరుగుతాయని విశ్వక్ చెప్పాడు. ''థియేటర్లు పూర్తిగా ఓపెన్ చేయలేదు.. ఇలాంటి సమయంలో 'పాగల్' రిలీజ్ చేయడం కరెక్టేనా అని నన్ను అడుగుతున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. 'సర్కస్ లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవికి వెళ్లి ఆడుకుని వచ్చే టైప్. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ అయ్యేలా చేయిస్తా. గుర్తుపెట్టుకోండి. సినిమా మామూలుగా ఉండదు. నా పేరు విశ్వక్ సేన్.. నేను చెప్పింది తప్పైతే పేరు మార్చుకుంటా'' అని విశ్వక్ సేన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు.
అంతేకాదు దయచేసి థియేటర్లలో సీట్లు మాత్రం చింపవద్దని.. మామూలుగా ఇండియా మొత్తానికి ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15, కానీ సినిమా థియేటర్స్ కి మాత్రం ఇండిపెండెన్స్ డే ఆగస్టు 14న అంటూ 'పాగల్' సినిమా మీద మాస్ కా దాస్ తన కాన్ఫిడెన్స్ ని తెలియజేశాడు. ఇక మధ్య మధ్యలో 'తాగుదాం.. మందు తాగుదాం' అంటూ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలోని డైలాగ్ ను ఫ్యాన్స్ గుర్తు చేయగా.. 'సినిమా హిట్టయ్యాక కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం.. మందు తాగుదాం' అని విశ్వక్ వారిని ఉత్సాహపరిచాడు. 'పాగల్' సినిమా మీద విశ్వక్ సేన్ చాలా నమ్మకంగా ఉన్నట్లు దీనిని బట్టి అర్థం అవుతోంది.
ఇదంతా బాగానే ఉన్నా విశ్వక్ సేన్ 'పాగల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విశ్వక్ కు తన సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండటంతో తప్పు లేదని.. కానీ యువ హీరోది మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. దీని మీద ఎన్నో మీమ్స్ దర్శనమిస్తున్నాయి. ఇండస్ట్రీ హిట్స్ - పాన్ ఇండియా సక్సెస్ లు చూసిన వాళ్ళు కూడా పేరు మార్చుకుంటా లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదని అంటున్నారు. మరొకొందరు మాత్రం టాలీవుడ్ లో నెపోటిజం హీరోలను తట్టుకొని నిలబడాలంటే ఆ మాత్రం యాటిట్యూట్ ఉండాలని.. విశ్వక్ కు తన సినిమా మీద నమ్మకంగా ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మరి మాస్ కా దాస్ కు ఉంది కాన్ఫిడెన్సా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.