Begin typing your search above and press return to search.

ఉప్ప‌ల్ వైయ‌స్సార్ దాస్ స్ఫూర్తి!

By:  Tupaki Desk   |   30 May 2019 9:44 AM GMT
ఉప్ప‌ల్ వైయ‌స్సార్ దాస్ స్ఫూర్తి!
X
ఆ యంగ్ డైరెక్ట‌ర్ కం యాక్ట‌ర్ నైజాం యాస ఇప్ప‌టికే ఓ రేంజులో వైర‌ల్ అవుతోంది. అతడి మాట తీరులో బోలెడంత ఫ‌న్ కురుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాస అబ్బుర‌ప‌రుస్తోంది. ఈ యాస‌లో ఫ్రీ స్టైల్.. ఫ్లో ఆక‌ట్టుకుంటోంది. నైజాంలో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌గా మాట‌ల మ‌రాఠీగా పాపుల‌రైపోయాడు. నేచుర‌ల్ స్టార్ నాని స్ఫూర్తితో యాక్ట‌ర్ అయ్యాన‌ని చెప్పాడు. దాస్ బ‌యోపిక్ తో ఇప్ప‌టికే బోలెడంత పాపులారిటీ వ‌చ్చేసింది అత‌డికి. అత‌డు న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఫ‌ల‌క్ నుమా దాస్` ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజవుతోంది. ఇంత‌కీ అత‌డు ఎవ‌రో చెప్పాల్సిన ప‌నేలేదు. పేరు విశ్వ‌క్ సేన్. అస‌లు `ఫ‌ల‌క్ నుమా దాస్` సినిమాకి స్ఫూర్తి ఏంటి? అంటే అత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన ఆన్స‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది.

మ‌ల‌యాళ రీమేక్ ఇది. ఇందులో అన్నీ నా చిన్న‌ప్ప‌టి పాత్ర‌లే. చిన్న‌ప్ప‌టి నుంచి హైద‌రాబాద్ గ‌ల్లీ గల్లీలో తిరిగాను. అర్థ‌రాత్రి ఎక్క‌డ ఏం కావాల‌న్నా తీసుకెళ్లి తినిపించ‌గ‌ల‌ను. అంత బాగా రాజ‌ధాని న‌గ‌రం తెలుసు. హైద‌రాబాద్ పాత్ర‌లు .. నా లైఫ్ మొత్తాన్ని తెర‌పై చూపించాను. చిన్న‌ప్ప‌టి నుంచి నా లైఫ్ లో జ‌రిగిన‌దంతా ఈ ఒక్క సినిమా ప్రిప‌రేష‌న్ అన్న‌మాట. ఇక టైటిల్ పుట్ట‌డానికి కార‌ణం ఉంది. నేను ఇక్క‌డ మ‌స్త్ పేర్లు విన్న.. అంబ‌ర్ పేట్ శంక‌ర్.. స‌న‌త్ న‌గ‌ర్ స‌త్తి.. నేను ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడు ఉప్ప‌ల్ వైయ‌స్సార్ అని ఒకాయ‌న ఉండేవాడు.. ఫ‌ల‌క్ నుమా అన‌గానే ఫ‌లకునుమా ప్యాలెస్ ఒక‌టే క‌నిపిస్తుంది.. దాని వెన‌క ఉన్న బ‌స్తీ ఎవ‌రికీ క‌నిపించ‌దు.. అందుకే ఆ పేరు పెట్టుకున్నా.

2009 బ్యాక్ డ్రాప్ సినిమా ఇది. అప్ప‌టి .. దూల్ పేట్ ఏరియా ఆర్కిటెక్చ‌ర్ వేరు.. ఇప్పుడు అంతా మారిపోయింది. కానీ నేటికీ ఫ‌ల‌క్ నుమా మారిపోలేదు. అందుకే అక్క‌డ తీశాను సినిమా. ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ గూగుల్ లో ట‌క్ మ‌ని క‌నిపిస్తుంది. అందుకే ఈ సినిమా తీశాను. అదే పేరు పెట్టుకున్నా.. అని తెలిపాడు విశ్వ‌క్. ఇక నా స్వ‌గ‌తం చెప్పాలంటే.. నేను పుట్టి పెరిగింది హైద‌రాబాద్. ఇంట‌ర్ వ‌ర‌కూ దిల్ షుక్ న‌గ‌ర్ లోనే ఉన్నా. నేను జ‌ర్న‌లిజం స్టూడెంట్ ని. రెండు స‌బ్జెక్టులు ఉండిపోయాయి. క్లియ‌ర్ చేయాలి.. అని అస‌లు సంగ‌తి చెప్పాడు. ఈ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నానికి ఫ‌ల‌క్ నుమా దాస్ స‌మీక్ష‌లొచ్చేస్తాయ్. దాస్ ట్యాలెంటు అప్పుడు ఓపెన్ అవుతుంది మ‌రి!!