Begin typing your search above and press return to search.

ఆ ఒక్క విషయంలోనే విశ్వక్ మిస్టేక్ చేశాడు..!

By:  Tupaki Desk   |   10 Nov 2022 3:09 PM GMT
ఆ ఒక్క విషయంలోనే విశ్వక్ మిస్టేక్ చేశాడు..!
X
యాక్షన్ కింగ్ అర్జున్ మరియు విశ్వక్ సేన్ మధ్య ఇటీవల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా.. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. దర్శక హీరోల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందుకు వెళ్ళడం లేదు. దీనిపై ఇప్పటికే అర్జున్ - విశ్వక్ మాట్లాడారు.

అర్జున్ - విశ్వక్ సేన్ వివాదంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభప్రాయాలను వ్యక్తం చేశారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ ఇష్యూలో అర్జున్ కి మద్దతుగా నిలబడ్డారు. యువ హీరోలు అనవసరంగా దర్శకుల పనిలో వేలు కాలు పెడుతూ సినిమాలని చెడగొతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా అర్జున్ - విశ్వక్ ఇష్యూపై కామెడీ సినిమాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి స్పందించాడు. ఈ వివాదంలో ఇద్దరి మిస్టేక్ లేదు.. కానీ పరిస్థితులు సినిమా జరక్కుండా చేశాయని నాకు అనిపించింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగేశ్వర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"కథ చెప్పకుండా సినిమా షూటింగ్ కమిట్మెంట్స్ జరగవు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందో.. స్టార్ట్ అయిన తర్వాతో పక్కన ఉండేవాళ్ళు చెప్పే మాటల వల్ల హీరోల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది బాగాలేదనో అది బాగాలేదనో.. కెరీర్ మంచి రైజింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నావ్ అంటూ డిస్టర్బ్ చేస్తుంటారు"

"బేసికల్ గా విశ్వక్ సేన్ అనేవాడు తన సొంత టాలెంట్ తో ఎటాక్ తో పైకి వచ్చినవాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, అందరినీ తనవైపు తిప్పుకున్న కుర్రాడు. తను అంత అనాలోచితంగా ఇలా చేసుంటాడని నేను అనుకోను. అర్జున్ కథ తీసుకొచ్చిన వెంటనే కమాన్ చేసేద్దాం అనుండడు. కథ వినుంటాడు.. కథ నచ్చి ఉంటుంది"

"అర్జున్ గారు 30 ఏళ్ళ క్రితం పెద్ద సూపర్ డూపర్ హిట్ చిత్రాలను చేసిన డైరెక్టర్ ఆయన. కథ ఓకే అయింది కాబట్టి ఆనాటి డైరెక్టర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలానే అర్జున్ గారు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయుండొచ్చు. కానీ ఇవాళ్టి జెనెరేషన్ ఎలా ఉందంటే.. ఏం జరుగుతుందో అంతా మాకు తెలియాలి అనుకుంటున్నారు. వీలైతే వాళ్ళు కూడా కథ ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటున్నారు"

"ఒకప్పుడు కథ చెబితే అయిపోతుంది.. ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత హీరోకి చెబుతాం. నేనైనా అంతే. కానీ ఇప్పుడు అలా కాదు. కొంతమంది యంగ్ హీరోలు కూడా కూర్చొని ట్రీట్మెంట్ చేసుకుంటున్న రోజులివి. దాన్ని తప్పుపట్టలేం. ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ విశ్వక్ సేన్ అది ముందు చెప్పి ఉంటే ఈ వివాదం జరిగేది కాదనేది నా ఫీలింగ్"

"సీన్స్ అన్నీ విన్న తర్వాత షూటింగ్ పెట్టుకుందాం అని చెప్పుంటే.. లేదా అర్జున్ గారే అన్ని సీన్స్ చెప్పి షూటింగ్ వెళ్లాలని అనుకుంటే ఈ గొడవ జరిగేది కాదేమో. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఏం చేస్తున్నాం అనే ప్రశ్న విశ్వక్ సేన్ కు వచ్చిందంటే అదే రీజన్ అయ్యుంటుంది. కథ చెప్పారు.. సీన్స్ ఏమున్నాయో తెలియదు.. ఏం జరుగుతుందో ఏం చేస్తానో అని ఆలోచించి ఉండొచ్చు"

"డైరెక్టర్ చైర్ లో ఉన్న అర్జున్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ కథ అద్భుతంగా వచ్చింది.. పాటలు బాగున్నాయి.. ఇలా డైరెక్టర్ మైండ్ సెట్ ఉంటుంది. ఒకరోజు ముందు షూటింగ్ ఆపండి అని అన్నాడు. ఆ ఒక్క విషయంలో విశ్వక్ సేన్ మిస్టేక్ చేసాడని నేను అనుకుంటున్నా. షూటింగ్ ఆపమని చెప్పే రైట్ లేదు.. అలా చెప్పడం రాంగ్"

"ఒక వారం రోజుల ముందే అన్ని సీన్స్ చెప్పమని అడిగి ఉండాల్సింది. అందులోనూ వారి మధ్య పాజిటివ్ మీటింగ్స్ జరిగినట్లుగా లేదు. వారిద్దరి మధ్య ట్రావెలింగ్ సరిగ్గా జరగలేదు. ఒక్కోసారి మన చుట్టూ ఉండే మనుషుల వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మేనేజర్స్ ద్వారా కాకుండా వారిద్దరే మాట్లాడుకోవాలి" అని నాగేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.