Begin typing your search above and press return to search.

బ్రేకప్‌ స్టోరీని ఫన్నీగా చెప్పిన యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   4 May 2022 4:30 AM GMT
బ్రేకప్‌ స్టోరీని ఫన్నీగా చెప్పిన యంగ్‌ హీరో
X
యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ టాపిక్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అతడు తన ప్రతి సినిమాను చాలా డెప్త్‌ గా యూత్‌ కు కనెక్ట్‌ అయ్యే విధంగా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాడు. సినిమా ప్రమోషన్‌ బాధ్యత మొత్తంను కూడా తన భుజాలపై వేసుకుని విశ్వక్ సేన్‌ యూత్‌ లోకి తీసుకు వెళ్తాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తూ ఒక ఫ్రాంక్ వీడియో చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. దాన్ని కవర్ చేసుకునేందుకు ఒక టీవీ స్టూడియోకు వెళ్లి అక్కడ హడావుడి చేసి మరింతగా చర్చనీయాంశం అయ్యాడు. విమర్శలు వచ్చినా వివాదం అయినా కూడా తన సినిమాకు మాత్రం ఫుల్‌ పబ్లిసిటీ దక్కడం జరిగింది.

సినిమా ప్రమోషన్‌ సందర్బంగా విశ్వక్ సేన్‌ బ్రేకప్‌ స్టోరీ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా పబ్లిసిటీని ఒక పబ్‌ సెటప్ లో ఏర్పాటు చేశారు. అక్కడ ఒక అమ్మాయి మీ సినిమాల్లో ఎక్కువ శాతం బ్రేకప్‌ లు ఉంటున్నాయి. నిజ జీవితంలో ఏమైనా బ్రేకప్‌ స్టోరీ లు ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. అందుకు విశ్వక్ సేన్‌ ఆసక్తికర సమాధానం చెప్పాడు.

ప్రతి మగాడి జీవితంలో బ్రేకప్ లు ఉంటాయని చెప్పాడు. అప్పుడు మీ లైఫ్‌ లో బ్రేకప్ ఉందా అంటూ యాంకర్ ప్రశ్నించగా ఒక అమ్మాయి ని ప్రేమించాను. ఆమె తో చాలా కాలం ట్రావెల్‌ చేశాను. ఒక రోజు ఆమె కు ఒక కాఫీ తెచ్చి ఇచ్చాను. ఆ కాఫీ పై ఉన్న ఫోమ్‌ ను నేను కలిపాను. అయితే ఆ ఫేమ్‌ ను కలపకూడదు అని నాకు తెలియదు. ఆ కాఫీని ఆమె పడవేసి అక్కడ నుండి వెళ్లి పోయింది.

నెల రోజుల తర్వాత ఆమె నాతో బ్రేకప్ అయ్యిందని తెలిసింది. నాతో ఆమె బ్రేకప్ అవ్వడానికి కారణం కాఫీ అని ఆమె స్నేహితురాలి వల్ల తెలిసింది. ఆమె స్నేహితురాలితో మళ్లీ తాను ప్రేమలో పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు. బ్రేకప్ ను కూడా ఇంత ఫన్నీగా చెప్పావ్ ఏంటి భయ్యా అంటూ సోషల్‌ మీడియాలో కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా మరో విజయాన్ని ఈ సినిమా తో దక్కించుకుంటాడనే నమ్మకం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అశోకవనంలో అర్జున కళ్యాణం లో విశ్వక్ సేన్ లుక్ మరియు పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో తప్పకుండా ఇది ఆయనకు మంచి టర్నింగ్‌ పాయింట్‌ గా నిలుస్తుందని అంటున్నారు.