Begin typing your search above and press return to search.
ఎవడ్రా నన్ను తొక్కేది.. అంటూ రెచ్చిపోయిన విశ్వక్
By: Tupaki Desk | 8 Jun 2019 4:01 AM GMTటాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా అందరినీ ఆకర్షిస్తున్న వ్యక్తి విశ్వక్ సేన్. 'ఫలక్ నుమా దాస్' అనే బోల్డ్ సినిమాలో హీరోగా నటించి.. నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరించి మల్టి-టాస్కింగ్ చేయడం తనకు చేతనవుతుందని నిరూపించాడు. దర్శకుడిగా అనుభవలేమి వల్ల సినిమా కొంచెం తేడా కొట్టిందని.. విశ్వక్ లో మంచి టెక్నిషియన్ ఉన్నాడనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే తన బోల్డ్ టాక్ తో.. లిమిట్ దాటిన బూతులతో హంగామా చేయడం.. విమర్శలు ఎక్కువ కావడంతో సారీ చెప్పడం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో మరోసారి విశ్వరూపం చూపించాడు.
తమ సినిమాను కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని.. అయితే అది కుదరలేదు కాబట్టే ఈరోజు సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నానని తెలిపాడు. తన మీద ట్రోల్స్ నడుస్తున్నాయనే విషయం తనకు తెలుసని.. అది తనకు మజాగా ఉందని అన్నాడు. మరోవైపు తనకు ఫ్యాన్స్ వైపు నుండి సాలిడ్ గా సపోర్ట్ కుడా ఉందని చెప్పాడు. "ఫలక్ నుమా దాస్ థియేటర్లలో చించి పడేస్తుంది. ఎవడు ఆపుదామనుకున్నా ఏం చెయ్యలేరుబాస్. మీరేమైనా చేసి ఉంటే ఈపాటికి నేను ఇక్కడ నిలుచుని ఉండేవాడిని కాదు" అన్నాడు.
"నన్ను ట్రోల్ చేస్తున్నారు. అదంతా చూస్తుంటే మజా వస్తోంది. ఫ్యాన్స్ కూడా మెసేజీలు పెడుతున్నారు. 'అన్నా నీకేం కాదు.. నీతో మేమున్నాం అన్నా' అంటున్నారు. నేను మీకు చెప్పేది ఒకటే. నాకేం కాలేదు. ఎవరూ టెన్షన్ పడకండి. మరి కొందరేమో 'జాగ్రత్తరా బయ్.. తొక్కేస్తార్రా నిన్ను' అంటున్నారు. తొక్కించుకోవడానికి నేనేం కోకాకోలా టిన్ కాదు తాగి పడేసిన సిగరెట్ పీక కాదు. ఎవడ్రా నన్ను తొక్కేది" అంటూ తనదైన స్టైల్ లో రెచ్చిపోయాడు.