Begin typing your search above and press return to search.

అర్జున్ ఆరోప‌ణ‌ల‌పై విశ్వ‌క్ ఏమ‌న్నాడో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Nov 2022 2:53 PM GMT
అర్జున్ ఆరోప‌ణ‌ల‌పై విశ్వ‌క్ ఏమ‌న్నాడో తెలుసా?
X
యాక్ష‌న్ కింగ్ అర్జున్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్ సేన్ హీరోగా ఓ మూవీని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య అర్జున్ హీరోయన్ గా న‌టించ‌నుంది. ఈ మూవీని కొన్ని నెల‌ల క్రితం ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంఛ‌నంగా క్లాప్ కొట్టి ప్రారంభించారు. అయితే ఇంత వ‌ర‌కు రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని విష‌యాల్లో అర్జున్ కు, హీరో విశ్వ‌క్ సేన్ కు మ‌ధ్య అభిప్రాయ బేధాలు రావ‌డంతో విష‌యం మీడియా ముంద‌కొచ్చింది.

శ‌నివారం ఈ విష‌య‌మై హీరో అర్జున్ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి హీరో విశ్వ‌క్‌సేన్‌ నిబ‌ద్ధ‌త లేని న‌టుడ‌ని, త‌న‌ది ప్రొఫెష‌న‌లిజం కాద‌ని, త‌న వ‌ల్లే సినిమా నిర్మాణం ఆపేస్తున్నాన‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కీల‌క షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ త‌ను ఉద‌యం 5:30 గంట‌ల‌కు షూటింగ్ క్యాన్సిల్ చేయండి సార్ ప్లీజ్ అని మెప‌సేజ్ చేయ‌డం షాక్ కు గురిచేసింది. ఇలా త‌ను ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియ‌లేదు.

క‌థ‌, క్యారెక్ట‌ర్‌, డైలాగ్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఇలా త‌ను ఎందుకు చేస్తున్నాడా అనిపించింది. నేను జీర్ణించుకోలేక‌పోయా. మ‌రీ ఇంత ప్రొఫెష‌న‌లిజ‌మా?. నిజంగా ఇది టెక్నీషియ‌న్స్ ని అవ‌మానించ‌డ‌మే. త‌రువాత ఆయ‌న మేజేజ‌ర్ `సార్ నేను త‌రువాత మాట్లాడుతా` అని మెసేజ్ చేశాడు. ఒక ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ అంటే అత‌నికి మ‌ర్యాద లేదా?. ఈ హీరోని పెట్టుకుని బాగా డ‌బ్బులు సంపాదించాల‌ని నేను అనుకోలేదు. ఓ మంచి సినిమా తీయాల‌నుకున్నా.

ఏ ఫైనాన్సియ‌ర్ ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకోలేదు.. ఇండ‌స్ట్రీలో ఎంతో మంది నిబ‌ద్ద‌త గ‌ల న‌టుల‌ను ఎంతో మందిని చూశా. జ‌గ‌ప‌తిబాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్‌. ఆయ‌న‌ని డేట్స్ అడిగా..ఆయ‌న త‌న షెడ్యూల్ చూపించి అది పూర్త‌యిన త‌రువాత రెండు నెల‌ల పాటు ఏ సినిమాలు లేవ‌న్నాడు.. అంటూ విశ్వ‌క్ సేన్ పై విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై హీరో విశ్వ‌క్ సేన్ స్పందించాడు. సంభాష‌ణ‌లు, పాట‌లు, మ్యూజిక్ విష‌యంలో నేను అన్న‌మాట నిజ‌మే అన్నారు.

అయితే ఆస‌క్తిక‌రంగా అనిపించిన చిన్న చిన్న మార్పుల‌కు కూడా అర్జున్ అస్స‌లు అంగీక‌రించ‌డం లేద‌ని, తాను చెప్పిన‌ట్టే న‌డుచుకోవాల‌ని అంటున్నార‌న్నాడు. అంతే కాకుండా సెట్ లో త‌న మాట‌కు అస్స‌లు గౌర‌వం వుండ‌ద‌ని, అందుకే త‌న మ‌న‌కు న‌చ్చ‌ని ప‌ని చేయ‌లేక సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని విశ్వ‌క్ సేన్ తెలిపాడు. ఇక సినిమాకు సంబంధించిన రెమ్యున‌రేష‌న్ చెక్ లు,డాక్యుమెంట్ లు నిర్మాత‌ల మండ‌లికి పంపిన‌ట్టు తెలియ‌జుశాడు. మ‌రి ఈ వివాదంపై ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఏమంటారో.. ఎలాంటి ప‌రిష్కారాన్ని చూపిస్తారో .. వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.