Begin typing your search above and press return to search.

మన దాస్ తమిళ అమ్మాయికి పడిపోయాడా..?

By:  Tupaki Desk   |   21 March 2023 10:00 PM GMT
మన దాస్ తమిళ అమ్మాయికి పడిపోయాడా..?
X
హీరో కమ్ డైరెక్టర్ మాస్ కాదా దాస్ విశ్వక్ సేన్ ఉగాది కానుకగా దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో కోలీవుడ్ అందాల భామ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ హీరోగానే కాదు దర్శకత్వం కూడా వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగుంది.

సినిమాతో మరోసారి తన మాస్ స్టామినా చూపించబోతున్నాడు విశ్వక్ సేన్. ఆల్రెడీ నివేదా పేతురాజ్ తో పాగల్ సినిమాతో జత కట్టాడు విశ్వక్ సేన్. ఆ సినిమాలో వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా హిట్ అవడంతో కాంబినేషన్ సూపర్ అనిపించుకుంది.

ఇక విశ్వక్ సేన్ ధమ్కీ కూడా నివేదాని హీరోయిన్ గా తీసుకోవడం వెనక హీరోగారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని టాక్. దాస్ కా ధమ్కీ సినిమాలో నివేదా ఇదివరకు ఎప్పుడూ లేనంత గ్లామర్ షో చేసింది. ఇక సినిమా పూర్తి చేసి రిలీజ్ కు రెడీ అవగా మూవీ ప్రమోషన్స్ లో కూడా విశ్వక్ కి సపోర్ట్ గా ప్రమోట్ చేస్తుంది నివేదా పేతురాజ్. వరుస ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్స్ వీటిలో విశ్వక్ వెంటే ఉంటూ సినిమాకు కావాల్సినంత సహకారం అందిస్తుంది అమ్మడు.

ఈ జర్నీలో విశ్వక్ కి బాగా దగ్గరైందట నివేదా పేతురాజ్. విశ్వక్ కూడా నివేదాని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నట్టు టాక్. ఇద్దరు కలిసి దాస్ కా ధంకీని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ లో విశ్వక్ తెలుగు లోకేష్ కనకరాజ్ అని.. అతనిలో చాలా టాలెంట్ ఉందని చెప్పేస్తుంది నివేదా పేతురాజ్. తన సహ నటుడు, డైరెక్టర్ అయిన విశ్వక్ ని అంతగా అబ్సర్వ్ చేసింది అంటే అమ్మడు కూడా విశ్వక్ ని లైక్ చేస్తుందని అంటున్నారు.

హీరో హీరోయిన్ హిట్ కాంబో రిపీట్ అయితే వారి మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు రావడం సర్వ సాధారణం. ఇదే దారిలో విశ్వక్, నివేదా మధ్య ఏదో జరుగుతుందని అనే వారు ఉన్నారు. కొందరైతే తమిళ అమ్మాయి ప్రేమలో మన మాస్ కా దాస్ పడిపోయాడని కూడా డిక్లేర్ చేస్తున్నారు.

ఇద్దరు క్లోజ్ గా కలిసి ఉన్నంత మాత్రాన వారి మధ్య ప్రేమ ఉన్నట్టు చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక మంచి సినిమా ని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప వారి మధ్య ఏమి లేదు అని ఇన్సైడ్ టాక్ . మరి ఈ వార్తలపై ఇటు విశ్వక్ అటు నివేదా ఎలా స్పందిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.