Begin typing your search above and press return to search.

బాస్ కోసం దాస్.. రిస్క్ లో పడ్డాడుగా..!

By:  Tupaki Desk   |   22 May 2020 5:30 PM GMT
బాస్ కోసం దాస్.. రిస్క్ లో పడ్డాడుగా..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యువ హీరో, 'ఫలక్‌నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై అభిమానంతో ట్రిబ్యూట్ టు ఎన్టీఆర్ అంటూ ఒక ర్యాప్ సాంగ్ విడుదల చేశాడు. ఫుల్ మాస్ లిరిక్స్ తో ఫటాఫట్ సింగింగ్ తో 'మాస్ కా దాస్' పాట రూపొందింది. అయితే వేగంగా సాగిన ఆ పాట వేరే సాంగ్ కి రీమిక్స్ అంట. ఒరిజినల్ మాత్రం వేరే ఉందంటున్నారు. నిజానికి ఆ ఫాస్ట్ లిరిక్స్ పాట విన్నవారు ఎవరికీ కూడా అర్థం కాకుండా ఉన్నాయి. ర్యాప్ సాంగ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఇక 'ఫలక్‌నుమా దాస్' కోసం సంగీత దర్శకుడు వివేక్ సాగర్ స్వరపరిచిన పాటను ఎడిట్ చేసి విశ్వక్ సేన్ రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ ఎన్టీఆర్ అభిమానులకు బాగానే నచ్చినా.. ఇంకొంచెం స్లో మసాలా ఉంటే బాగుండేది అని శ్రోతల ఫీలింగ్. ఇక ఎన్టీఆర్ అభిమానులకు అయితే ఈ సాంగ్ పెద్ద ట్రీట్ అని చెప్పాలి. వారంతా ట్విట్టర్ రికార్డులతో పాటు ఈ సాంగ్ కూడా బాగుందంటూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు.

కానీ అసలు విషయం ఏంటంటే.. ఇలా సాంగ్ రిలీజ్ చేసి.. ట్వీట్లు చేసే వరకు సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కి ఈ విషయం తెలియదట. ఇక ఇలా చెప్పకుండా తన సాంగ్ వాడిన పద్ధతి వివేక్ కి ఏమాత్రం నచ్చలేదట. దీని గురించి తెలిసిన వెంటనే.. "ఈ పాటను అభినందించవద్దు. వృత్తిలో భాగంగా ఈ పాటను సినిమా కోసం చేశాను. బర్త్ డే విషెస్ కోసం కాదు. ఈ విషయమై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా. ఈ పాటతో నాకు సంబంధం లేదు. విశ్వక్ సేన్ ను చాలాసార్లు పాట తీసేయమని కోరాను. కానీ, అతడు అలా చేయలేదు. పాటను ఎందుకోసం అయితే చేశామో ఆ స్ఫూర్తిని అతడు చంపేశాడు. విశ్వక్ సేన్ ప్రవర్తన పట్ల నేను తీవ్ర అసంతృప్తితో ఉన్నాను" అని వరుస ట్వీట్లలో వివేక్ సాగర్ క్లారిటీ ఇచ్చాడు. కాపీ రైట్స్ విషయమై అతడు కంప్లయింట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి బాస్ కోసం విశ్వక్ రిస్క్ లో పడ్డట్లు అయింది.