Begin typing your search above and press return to search.
ఆ న్యూస్ వెంటనే డిలీట్ చేయండి : విశ్వక్ సేన్
By: Tupaki Desk | 9 May 2022 10:54 AM GMTఈమద్య విశ్వక్ సేన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సాదారణంగా ఒక హీరో సినిమా విడుదల ఉందంటే విడుదలకు ముందు కొన్ని రోజులు విడుదలకు కొన్ని రోజుల వరకు వార్తల్లో ఉండటం చాలా కామన్ విషయం. ఇప్పుడు విశ్వక్ సేన్ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్నాడు. అది సినిమా వల్లే కాకుండా కొన్ని వివాదాస్పద విషయాల వల్ల కూడా ఆయన వార్తల్లో నిలుస్తున్నాడు.
వివాదం అనేది ఆయన వల్లే కాకుండా బయటి వారి వల్ల కూడా ఆయన గురించి మొదలవుతుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ను చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ సమయంలో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థ ఒకటి ప్రముఖంగా వార్త కథనంను ప్రసారం చేసింది. దాంతో హీరో విశ్వక్ సేన్ సదరు మీడియా సంస్థ టీమ్ తో స్వయంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా తేదీలను కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు అలాంటి నిర్ణయం ఏమీ జరగలేదు.
అసలు ఓటీటీ లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు అన్నట్లుగా విశ్వక్ సేన్ అన్నాడు. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని.. ఓటీటీ లో థియేటర్ లో దక్కే ఫీల్ కలుగదు అన్నట్లుగా విశ్వక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తన సినిమాను థియేటర్ల ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ విశ్వక్ సేన్ కృతజ్ఞతలు తెలియజేశాడు.
మరికొన్ని వెబ్ మీడియా సంస్థలు కూడా తమ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు రాస్తున్నారు. దయచేసి వారు అంతా కూడా ఆ వార్తలను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు. న్యూస్ డిలీట్ చేయమని విజ్ఞప్తి చేసిన విశ్వక్ సేన్ తప్పకుండా థియేట్రికల్ ఫీల్ ను ఎంజాయ్ చేయమంటూ విజ్ఞప్తి చేశాడు. పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను ఈ సినిమా రాబడుతోంది.