Begin typing your search above and press return to search.

'ముఖ‌చిత్రం'కోసం మాస్ కా దాస్ స‌రికొత్త అవ‌తారం

By:  Tupaki Desk   |   29 March 2022 5:30 AM GMT
ముఖ‌చిత్రంకోసం మాస్ కా దాస్ స‌రికొత్త అవ‌తారం
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ త‌న పంథా మార్చారు. స‌రికొత్త చిత్రాల‌తో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం' చిత్రంలో న‌టిస్తున్న విశ్వ‌క్ సేన్ తాజాగా స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నారు. ఓ విభిన్న‌మైన స్టోరీతో కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న 'ముఖ‌చిత్రం' మూవీలో విశ్వ‌క్ సేన్ ప‌వ‌ర్ ఫుల్ గా సాగే అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం విశ్వ‌క్ సేన్ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది.

సాయంత్ర 5 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్ క్యారెక్ట‌ర్ కి సంబంధించిన‌ ఫ‌స్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తోంది. వికాస్ వ‌శిష్ట‌, ప్రియ వ‌డ్ల‌మాని, చైత‌న్య రావు, అయేషా ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ 'ముఖ చిత్రం'. 'క‌ల‌ర్ ఫొటో' ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు అందిస్తున్నారు.

ఎస్‌.కె.ఎన్ స‌మ‌ర్ప‌ణ‌లో పాకెట్ మ‌నీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్ర‌దీప్ యాద‌వ్‌, మోహ‌న్ య‌ల్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోర్ట్ రూమ్ డ్రామాగా థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగాధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈమూవీలో హీరో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ప‌వ‌ర్ ఫుల్ లాయ‌ర్ గా విశ్వామిత్ర పాత్ర‌లో న‌టించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం స్పెష‌ల్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. ఇది క‌థ‌ని కీల‌క‌మ‌లుపు తిస్తే అతిథి పాత్ర‌. చాలా ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుంద‌ని, ఆయ‌న పాత్ర 15 నుంచి 20 నిమిషాల పాటు మాత్ర‌మే సినిమాలో క‌నిపిస్తుంద‌ని, ఈ పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ అద్భుతంగా న‌టించార‌ని, ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌ని చిత్ర బృందం తెలిపింది.

ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు సాగే అతిథి పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ న‌టించ‌డం ఇదే తొలిసారి కావడంతో సినిమాపై ఆస‌క్తి మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, పోస‌ర్స్ సినిమా ఓ ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా భావించారు. కానీ తాజాగా విడుద‌ల చేసిన విశ్వ‌క్ సేన్ క్యారెక్ట‌ర్ తో ఈ మూవీ అత్యంత ప‌వ‌ర్ ఫుల్ గా సాగే కోర్ట్ రూమ్ డ్రామా అని స్ప‌ష్ట‌మైంది.

ఇప్ప‌టికే అన్ని కార్య‌క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, స‌మ‌ర్ప‌ణ ఎస్ కె ఎన్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు సందీప్ రాజ్‌. ద‌ర్శ‌క‌త్వం గంగాధ‌ర్‌.