Begin typing your search above and press return to search.
అసలు చిరంజీవి మారలేదు అంతే
By: Tupaki Desk | 3 Jun 2016 10:01 AM GMTతన అనుభవాలను.. తన సినిమాల్లో చూపించిన ఆ నిజాయితీని.. అలాగే తన ఫిలిం మేకింగ్ తాలూకు సీక్రెట్లను ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా పంచుకుంటున్నారు సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతే. పైగా అలాంటి హీరోను నేను జీవితంలో చూడలేదు అంటున్నారు.
''చిరంజీవితో శుభలేఖ సినిమా చేసిన ఓ ఏడేళ్ళ తరువాత స్వయంకృషి కథను చెప్పడానాకి వెళ్ళాను. కథ విని.. వెంటనే చేసేద్దాం అన్నాడు. అప్పటికే తనకు విపరీతమైన స్టార్ డమ్ వచ్చేసింది. సుప్రీమ్ హీరో డైనమిక్ హీరో అంటున్నారు ఆయన్ను. కాని తను మాత్రం అభిమానులు ఏమంటారు అనుకోకుండా.. గ్లామర్ లేని చెప్పులు కుట్టుకునేవాడి పాత్రలో నటించాడు. అదే అతని గొప్పతనం'' అంటూ ''స్వయంకృషి''తో నిజంగా పైకెదిగిన వ్యక్తి అంటే చిరంజీవే అని కితాబిచ్చారు విశ్వనాథ్.
అంతేకాదు.. చిరంజీవి యొక్క నమ్రత గురించి చెబుతూ.. ''ఇప్పుడు మెగాస్టార్ అంటే ఒక శకం. ఒక హిస్టరి. మరి చిరంజీవిని నేను ''మీరు'' అని పిలవాలా లేకపోతే ''నువ్వు'' అని పిలవాలా అని అడిగితే.. 'మీరు అని పిలిచి నన్ను అవమానించకండి గురువు గారు' అన్నాడు ఈ వ్యక్తి. అది అతని గొప్పతనం. ఎంత పైకి ఎదిగినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అసలు చిరంజీవి అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. స్వయంకృషి సినిమాలోని క్యారెక్టర్ కు ఇతడు నిజజీవితపు ఉదాహరణ'' అంటూ సెలవిచ్చారు.
ఇదే విషయంపై చిరంజీవి స్పందిస్తూ.. విశ్వనాథ్ వంటి దిగ్గజాలు తీసిన సినిమాలు చూసి పెరిగినందువలన.. మేబీ తనలో అలాంటి గుణాలు వచ్చుండొచ్చని.. ఆ క్రెడిట్ అంతా విశ్వనాథ్ గారికే దక్కుతుందని తెలిపారు.