Begin typing your search above and press return to search.
ఆ రోజు చెన్నైకి రాత్రి ఉండదు!
By: Tupaki Desk | 2 Jan 2019 1:30 AM GMTఅదేంటి సూర్యుడు రాత్రి ఉంటాడా చెన్నైలో అని ఆశ్చర్యపోకండి. ఈ పొంగల్ కు ఓ రోజు అచ్చంగా అలాగే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. గత దశాబ్ద కాలంలో బిగ్గెస్ట్ కోలీవుడ్ క్లాష్ గా అక్కడి ట్రేడ్ భావిస్తున్న పెట్ట-విశ్వాసం రెండూ జనవరి 10నే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ విషయంలో ఎవరిది పైచేయి అవుతుంది అనే దాని మీద ఇప్పటికే అభిమానులు భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి.
ముఖ్యంగా చెన్నై నగరంలో ఉన్న స్క్రీన్లన్ని ఈ రెండు సినిమాలతోనే నిండిపోతున్నాయి. సమానంగా సర్దలేక డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు విపరీతమైన ఒత్తిడిని ఎదురుకుంటున్నారు. మిడ్ నైట్ షోస్ కాబట్టి సాయంత్రం నుంచే థియేటర్ల దగ్గర సందడి నెలకొని ఉంటుంది. చుట్టుపక్కల పరిసరాలు ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ సైతం 10వ తేదీ మీద ప్రత్యేక దృష్టి సారించనుంది. హీరోల మీద అభిమానం విషయంలో కాస్త ఓవర్ గా ప్రవర్తించే తమిళ తంబీలు ఇలాంటి సమయంలో సంయమనంతో ఉండటం కష్టమే. అందుకే ప్రభుత్వం వైపు నుంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
నిజానికి ఈ క్లాష్ జరగకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున విశాల్ విశ్వప్రయత్నం చేసినప్పటికీ అవి ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు నిర్మాణ సంస్థలు ససేమిరా అనడంతో సరే కొట్టుకు చావండి అంటూ వదిలేసారు. 9వ తేదీ రాత్రి మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి పోలీసులు టెన్షన్ గానే ఉన్నారు. మనకా ఇబ్బంది లేదు. పెట్ట వస్తోంది కానీ విశ్వాసం డబ్బింగ్ ఆలోచన వాయిదా వేసుకున్నారు. వినయ విధేయ రామ-ఎన్టీఆర్-ఎఫ్ 2ల మధ్య పెట్టకు స్క్రీన్లు దొరకడమే కష్టంగా ఉంది. ఇక విశ్వాసం గురించి వేరే చెప్పాలా