Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఎవరా హంతకుడు

By:  Tupaki Desk   |   25 Feb 2019 8:23 AM GMT
ట్రైలర్ టాక్: ఎవరా హంతకుడు
X
టాలీవుడ్ లో థ్రిల్లర్లు ఈ మధ్య సర్వ సాధారణం అయిపోయాయి. గత కొంత కాలంగా ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ కూడా లేదు. ఎవరైనా స్టార్ హీరోనో లేదా గుర్తింపు ఉన్న మీడియం రేంజ్ యాక్టరో చేస్తే కొంత అటెన్షన్ తీసుకుంటుంది కాని అదేమీ లేకుండా చిన్న నటీనటుల మీద ఆధారపడితే ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత సులభం కాదు. ఆ కోవలో వస్తోందే విశ్వామిత్ర. ప్రేమ కథా చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సరైన సక్సెస్ లేక వెనుకబడిపోయిన నందితా రాజ్ కీలక పాత్రలో రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన విశ్వామిత్ర ట్రైలర్ ఇందాక విడుదలైంది.

బయట ఎవరి కంటికి కనిపించని ఓ వ్యక్తి కేవలం హీరొయిన్(నందితా శ్వేతా)తోనే పరిచయం పెంచుకుంటాడు. అతను పదిహేను రోజుల క్రితమే చనిపోయి ఉంటాడు. తిరిగి వచ్చి ఆ అమ్మాయి సమస్యలన్ని పరిష్కరిస్తాడు. ఈ లోపు కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. పోలీస్ ఆఫీసర్(ప్రసన్న)రంగంలోకి దిగుతాడు. కేసు జటిలం అవుతుంది. అసలు విశ్వామిత్ర ఎవరు ఆ అమ్మాయికే ఇదంతా ఎందుకు జరుగుతోంది మిగిలిన పాత్రలకు తనకు కనెక్షన్ ఏంటి అనేదే అసలు సినిమా

ట్రైలర్ లో మరీ కొత్తదనం అయితే లేదు. ఒక ఫార్ములా ప్రకారం సస్పెన్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఆసక్తి రేపే ప్రయత్నం చేసారు. దర్శకుడు రాజ్ కిరణ్ ఇంతకు ముందు గీతాంజలి త్రిపుర లాంటి హారర్ థ్రిల్లర్స్ ని డీల్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ రూట్ లోనే వెళ్లారు. ఈయన గత సినిమా లక్కున్నోడు తేడా కొట్టిన నేపధ్యంలో తన పాత జానర్ కే కట్టుబడ్డారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన విశ్వామిత్రలో సత్యం రాజేష్-అశుతోష్ రానా-విద్యుల్లేఖ రామన్-సత్య-జీవా-విజయ చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చ్ 21న విడుదల కానున్న విశ్వామిత్ర టైటిల్ వెనుక సస్పెన్స్ కూడా ఇందులో చూపలేదు కాని ఆ అజ్ఞాత వ్యక్తి పేరే అయ్యుంటుందనే క్లూ మాత్రం ఇచ్చారు. అంచనాలు అమాంతం పెంచలేకపోయినా ఇలాంటి సినిమాలను ఇష్టపడే వాళ్ళను ఓ మోస్తరుగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే జరిగింది