Begin typing your search above and press return to search.
ఆ సినిమా ఎప్పటికీ రిలీజవ్వదా?
By: Tupaki Desk | 29 Feb 2016 1:30 PM GMTకమల్ హాసన్ సినిమా అంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. ఆయన సినిమాల్లో ఏది కూడా అనుకున్న సమయానికి ఏ వివాదం లేకుండా విడుదలవదు. ఐతే ఎలాగోలా విడుదలైతే చాలని అనుకుంటారు ఆయన అభిమానులు. కానీ కమల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశ్వరూపం-2 మాత్రం ఎప్పటికీ విడుదలయ్యేలా కనిపించట్లేదు. ‘మరుదనాయగం’ తరహాలోనే ఇది కూడా మరుగున పడిపోయేలా ఉంది. ఐతే మరుదనాయగం చిత్రానికి, దీనికి ఉన్న తేడా ఏంటంటే.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కానీ విశ్వరూపం-2 దాదాపుగా పూర్తయినా కూడా దానికి మోక్షం కలిగేలా లేదు.
విశ్వరూపం ఫస్ట్ పార్ట్ తనే స్వయంగా నిర్మించిన కమల్ హాసన్.. రెండో భాగాన్ని మాత్రం ప్రముఖ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేతికి అప్పగించి పెద్ద తప్పు చేశాడు. ఈ సినిమా షూటింగ్ జరిగేన్ని రోజులు పరిస్థితి బాగానే ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక డబ్బులు ఇవ్వలేదు ఆస్కార్. మొత్తం అంతా ‘ఐ’ మీదే పెట్టుబడిగా పెట్టేశాడు. ఐతే ఆ సినిమా విడుదలయ్యాకైనా విశ్వరూపం-2 పోస్ట్ ప్రొడక్షన్ మొదలవుతుందేమో అనుకుంటే.. సరిగ్గా ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని ఈ సినిమాను పక్కనబెట్టేశాడు ఆస్కార్. ఈ మధ్యే అతడికి చెందిన రూ.35 కోట్ల ఆస్తిని బ్యాంకు వాళ్లు వేలం వేశారు. ఇంకా ఆయన ఆస్తులన్నింటికీ సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి. విశ్వరూపం-2 మీద పెట్టిన పెట్టుబడి మీద కూడా విచారణ సాగుతోంది. ఈ సినిమాను వేరే వాళ్లు టేకప్ చేసే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కోసం రూ.20 కోట్ల దాకా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉందట. వర్క్ కూడా చాలానే ఉందట. దీంతో ఇప్పట్లో ఆ సినిమాకు మోక్షం కలిగేలా లేదు. భవిష్యత్తులో కూడా సినిమాను బయటికి తేవడం కష్టమే అంటున్నారు. ఎంతో ఆసక్తి రేపిన సినిమా ఇలా అయిపోవడమే విచారకరమే.