Begin typing your search above and press return to search.

వితిక బర్త్ డే.. వరుణ్ స్పెషల్ సందేశం

By:  Tupaki Desk   |   3 Feb 2021 3:12 AM GMT
వితిక బర్త్ డే.. వరుణ్ స్పెషల్ సందేశం
X
వరుణ్ సందేశ్ - వితిక షెరు జంట తెలియ‌ని నెటిజ‌న్ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌కు ముందు కొంత మందికి మాత్ర‌మే నోటెడ్ అయిన ఈ పెయిర్‌.. బిగ్ బాస్ షో మూడో సీజన్ త‌ర్వాత అంద‌రికీ తెలిసిపోయింది. హౌస్ లో కొన‌సాగినంత కాలం.. అంద‌రి చూపూ ఈ జంట‌పైనే నిలిచింది. వితిక హీరోయిన్ గా ట్రై చేసిన‌ప్ప‌టికీ.. ఆమె చేసిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. కానీ.. ‘బిగ్ బాస్’తో మాత్రం కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది.

‘బిగ్ బాస్‌’షోలోకి వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయేమో అనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ.. వరుణ్ - వితిక షెరు మాత్రం అన్యోన్యంగా గేమ్ ప్లే చేశారు. అయితే.. ఈ షోలో వరుణ్ సందేశ్‌కి పాజిటివ్ ఇమేజ్ రాగా.. వితిక షెరుకు కాస్త నెగెటివ్ వచ్చింది. ఆమె ఒకరి విషయాలు మరొకరికి షేర్ చూస్తోందనే కారణంతో ఆడియన్స్ అవైడ్ చేశారు.

కాగా.. ఈ మధ్య వితిక షెరు సిస్టర్ మ్యారేజ్ జరిగింది. ‘మా చెల్లి పెళ్లి..’ అంటూ రచ్చ చేసింది. వీడియోలు, ఫొటోలు కంటిన్యూస్ గా రిలీజ్ చేస్తూ నానా హంగామా చేసింది. ఇక, వితిక సోదరి పెళ్లిలో బిగ్ బాస్ కంటిస్టెంట్స్.. అషూ, పునర్నవి, లాస్య, శివజ్యోతి, హిమజ వంటి వారు సందడి చేశారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. ఇవాళ వితిక బర్త్ డే. ఈ స్పెషల్ డే సందర్భంగా తన బెటర్ హాఫ్ కు స్పెషల్ సందేశమిచ్చాడు వరుణ్. ‘నా దేవతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆ దేవుడు నీకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశాడు వరుణ్ సందేశ్.