Begin typing your search above and press return to search.
వైవా హర్షను అనాథను చేసేశారట
By: Tupaki Desk | 2 July 2018 10:32 AM GMT‘వైవా’ అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం.. హర్ష అనే కుర్రాడికి సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. యూట్యూబ్‌లో అతడిని హీరోను చేసింది. అతడి జీవితమే మారిపోయేలా చేసింది. ఈ షార్ట్ ఫిలిం ద్వారా వచ్చిన పేరుతో సినిమాల్లోనూ అవకాశాలందుకున్నాడు. అక్కడా కామెడీ పండించాడు. మంచి పేరు సంపాదించాడు హర్ష. తన ప్రయాణం గురించి చెబుతూ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను ఆసక్తికర సంగతులు చెప్పాడు.
తనను యూట్యూబే హీరోను చేసిందని.. కానీ ఆ యూట్యూబే తనను అనాథగా కూడా మార్చిందని అతను తెలిపాడు. తన సక్సెస్ స్టోరీ గురించి ఎవరో యూట్యూబ్ లో ఒక స్టోరీ చేశాడని.. ‘ఈ విషయం తెలిస్తే షాకవుతారు’ అని హెడ్డింగ్ పెట్టారని.. అనాథ అయి ఉండి కూడా తాను ఈ స్థాయికి ఎలా ఎదిగానో చూడమంటూ స్టోరీ చేశారని.. నిజానికి అదంతా శుద్ధ అబద్ధమని హర్ష చెప్పాడు. తనకు తల్లిదండ్రులు ఉన్నారని.. తన తల్లే తాను అనాథ అంటూ పెట్టిన వీడియోను తీసుకొచ్చి చూపించిందని అతను వెల్లడించాడు. ఇలాంటి వీడియోల వల్లే జెన్యూన్ గా ప్రయత్నించే వాళ్లకు యూట్యూబ్ లో విలువ లేకుండా పోతోందని హర్ష చెప్పాడు.
‘వైవా’ షార్ట్ ఫిలిం రిలీజైన మూడో రోజుకే తనకు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు హర్ష తెలిపాడు. అది చూసే బ్రహ్మానందం లాంటి లెజెండరీ కమెడియన్ కూడా తనకు ఫోన్ చేశారని.. బ్రహ్మానందం అసిస్టెంట్ ఒకరు ఫోన్ చేసి ఆయన గురించి చెప్పగానే ఏ బ్రహ్మానందం అని అడిగానని.. తర్వాత కమెడియన్ బ్రహ్మానందం అనగానే షాకయ్యానని.. ఫలానా టైంలో మళ్లీ ఫోన్ చేయమని చెప్పారని.. తర్వాత ఫోన్ చేస్తే బ్రహ్మానందం మాట్లాడారని.. చాలా బాగా చేశావని మెచ్చుకుని సినిమాల్లో చేస్తావా అని అడిగి ఆయనే అవకాశాలు ఇప్పించారని హర్ష తెలిపాడు.