Begin typing your search above and press return to search.
మళ్లీ ఓటీటీకే ఫిక్స్ అయిన లాక్ డౌన్ 'వివాహ భోజనంబు'
By: Tupaki Desk | 23 Aug 2021 10:02 AM GMTయంగ్ హీరో సందీప్ కిషన్ సన్నిహితులతో కలిసి నిర్మించిన 'వివాహ భోజనంబు' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమాను ఈ నెల ఆరంభంలో సోనీ లివ్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే థియేటర్లు పునః ప్రారంభం అయ్యి విడుదల అయిన సినిమాలు మంచి వసూళ్లను దక్కించుకున్న నేపథ్యంలో వివాహ భోజనంబు సినిమాను థియేటర్ రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చాయి. దానికి తోడు ఈ నెల ఆరంభంలో స్ట్రీమింగ్ అవ్వాల్సిన సినిమాను కూడా వాయిదా వేయడం వల్ల థియేటర్ రిలీజ్ ఖాయం అనుకున్నారు. కాని థియేటర్ రిలీజ్ కు పెద్ద ఎత్తున సినిమాలు ఉండటంతో పాటు ఓటీటీ హక్కులను ముందుగానే సోనీ లివ్ కు ఇవ్వడం వల్ల మళ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.
వివాహ భోజనంబు సినిమా కొత్త విడుదల తేదీ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారమే సోనీ లివ్ లో ఈనెల 27వ తారీకున వివాహ భోజనంబు స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఉత్తరాది ప్రముఖ ఓటీటీ అయిన సోనీ లివ్ మొదటి సారి తెలుగు సినిమాను అందించబోతుంది. ఈ సినిమా తర్వాత సోనీ వారు తెలుగు లో వరుసగా పెద్ద చిన్న సినిమా హక్కులను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. వివాహ భోజనంబు సినిమా కరోనా నేపథ్యంలో తెరకెక్కింది. ఒక పిసినారి వ్యక్తి పెళ్లికి అతిథులు చాలా మంది హాజరు అవుతారు. వారు తిరిగి వెళ్లకుండా కరోనా వల్ల లాక్ డౌన్ వస్తుంది. దాంతో అతడి ఇంట్లోనే బంధువులు అంతా ఉంటారు.
పిసినారి పెళ్లి కొడుకు ఆ బంధువుల వల్ల పడ్డ కష్టాలు.. వారి ఖర్చులు తగ్గించేందుకు పెళ్లి కొడుకు చేసే ప్రయత్నాలు అన్ని కూడా చాలా వినోదాత్మకంగా ఉంటాయి. కమెడియన్ సత్య హీరోగా పరిచయం అవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆర్జావీ రాజ్ నటించింది. ఇంకా కీలక పాత్రలో శ్రీకాంత్ అయ్యంగారు మరియు సుదర్శన్ లు నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందించినట్లుగా చెబుతున్నారు. సందీప్ కిషన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నాడు.