Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఓటీటీ డీల్ క్యాన్సిల్‌

By:  Tupaki Desk   |   14 Aug 2021 5:44 AM GMT
ఆ సినిమా ఓటీటీ డీల్ క్యాన్సిల్‌
X
సందీప్‌ కిషన్‌ నిర్మాణంలో రూపొందిన వివాహ భోజనంబు సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ చేయాలని ప్రముఖ ఓటీటీ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. వినోదాత్మకంగా ఉండే ఈ సినిమాకు గాను సదరు ఓటీటీ వారు భారీ మొత్తంను ఇచ్చారనేది టాక్. థియేటర్లు ఓపెన్ లేని సమయంలో ఆ ఒప్పందం జరిగిది. కాని ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. అంతే కాకుండా ఇటీవల విడుదల అయిన సినిమాలకు మంచి వసూళ్లు కూడా నమోదు అవుతున్నాయి. వివాహ భోజనంబు సినిమాకు కూడా థియేటర్లలో మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకంతో ఓటీటీ డీల్ ను క్యాన్సల్ చేశారనే వార్తలు వస్తున్నాయి.

ఓటీటీలో విడుదల చేయడం కోసం ఇప్పటికే అడ్వాన్స్‌ తీసుకున్న కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తున్నాయి. అదే దారిలో ఈ సినిమా ను కూడా మొదట థియేట్రికల్‌ రిలీజ్ చేసి.. ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్ వసూళ్లను బట్టి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్లలో సినిమా క్లిక్‌ అయితే మంచి వసూళ్లు వస్తాయి. అలాగే ఓటీటీ ద్వారా శాటిలైట్‌ ద్వారా వచ్చే ఆదాయం ఎలాగూ వస్తుంది. కనుక థియేటర్‌ రిలీజ్ విషయంలో మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

వివాహ భోజనంబు సినిమా లో కీలక పాత్రలో సత్య నటించాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రూపొందిన సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది అంటూ ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు పోస్టర్ లతో నమ్మకం కలిగింది. జనాలు కూడా ప్రస్తుతం కాస్త ఎంటర్‌ టైన్ మెంట్‌ ను కోరుకుంటున్నారు. అందుకే కామెడీ సినిమా క్లిక్ అయితే జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టడం ఖాయం గా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివాహ భోజనంబు సినిమా తరహాలోనే ఇతర సినిమాలు కూడా థియేటర్‌ రిలీజ్ కు రావాలంటూ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అతి త్వరలోనే వివాహ భోజనంబు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.