Begin typing your search above and press return to search.
మహానటి కోసం ఆ పాట రీమిక్స్!!
By: Tupaki Desk | 23 Oct 2017 7:03 AM GMTఅలనాటి మహానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ వారానికి ఒక సెట్ ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎంతో ఇష్టంగా తెరకెక్కిస్తున్నాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది.
ఈ చిత్రం స్టార్ట్ అయినప్పుడు చాలా సైలెంట్ గా షూటింగ్ ను జరుపుకోంది. అంత పెద్దగా ఏ విధమైన న్యూస్ బయటకి వచ్చేది కాదు. కానీ ఈ మధ్యన సినిమా గురించి రోజుకొక న్యూస్ బయటపడుతోంది. చిత్రం లోని పాత్రలకు పాత్రలను ఎంచుకోవడం చూస్తుంటే.. అప్పట్లో మహానటులు ఎలా ఉండేవారో అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. అయితే సావిత్రి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మాయ బజార్ సినిమాలోని కీలక సన్నివేశాలను కూడా దర్శకుడు చూపించనున్నాడు. ఆ సినిమాలోని ఎస్వీ రంగారావు గారు చేసిన ఘటోత్కచుడి పాత్ర అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా వివాహ భోజనంబు అనే పాట ఇప్పటికి కూడా జనాల మనస్సులో మెదులుతూనే ఉంటుంది.
అయితే ఎస్వీ రంగారావు గారి పాత్రను ఇప్పటికే మోహన్ బాబు ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పాటను కూడా ఈ తరం వారికి కొత్తగా అనిపించడానికి రీమిక్స్ చేయనున్నారట. అప్పట్లో ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటశాల కంపోజ్ చేయగా.. మాధవపెద్ది సత్యం పాటను పాడారు. మరి ఇప్పుడు ఎవరు పాడతారనేది తెలియాల్సి ఉంది. ఇక మాయాబజార్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కె.వి.రెడ్డి గా నేటితరం దర్శకుడు క్రిష్ కనిపించనునుండగా.. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పాత్రలో పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నాడు.