Begin typing your search above and press return to search.
ఫ్లాప్ సినిమా అదరగొట్టేస్తోందే
By: Tupaki Desk | 29 Aug 2017 1:22 PM GMTతమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వివేకం చిత్రంపై ముందు నుంచి బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విడుదలవుతున్న అజిత్ మూవీ కావడంతో ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఎదురుచూశారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ.. ఎట్టకేలకు గత గురువారం నాడు థియేటర్లలోకి వచ్చింది. ముందునుంచి అనుకున్నట్లుగానే వసూళ్ల రికార్డుల దుమ్ము దులిపేస్తోంది కూడా. తమిళనాడులో అయితే.. ఈ మూవీ ఫిగర్స్ చూసి అందరి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. అసలు రివ్యూలకు నెగెటివ్ టాక్ కు ఏ మాత్రం సంబంధం లేకుండా వివేగం అదరగొట్టేస్తోంది.
మొదటి మూడు రోజులకే రూ. 68 కోట్ల వసూళ్లను సాధించిందంటే.. ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ అర్ధమవుతుంది. ముఖ్యంగా చెన్నైలో అయితే.. దాదాపు అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. కేవలం చెన్నైలోనే నాలుగో రోజు కూడా కోటి రూపాయలకు పైగా వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది వివేగం. అంతే కాదు..నాలుగు రోజుల్లో బాహుబలి2 3.24 కోట్లు వసూలు చేస్తే.. విజయ్ మూవీ భైరవ 3.09 కోట్లను కలెక్ట్ చేసింది. కానీ అజిత్ వివేగం మాత్రం ఏకంగా 5.20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేసింది. వివేగంకు ఓవర్సీస్ లో కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. కాని ఇదంతా అభిమానుల మహత్యమే అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇప్పటికే రెండుసార్లు అజిత్ సినిమాలను డైరక్ట్ చేసిన శివ.. మూడోసారి కూడా ఫ్లాపు తీసిన కూడా హిట్టు రేంజ్ కలక్షన్లను చేతిలో పెట్టాడు. అయితే ఈ సినిమా చివరాకరకు భారీగా పెట్టిన పెట్టుబడిని రికవర్ చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన విషయమే.