Begin typing your search above and press return to search.
బ్రహ్మాస్త్ర వసూళ్లపై అతగాడి పంచ్ లు మామూలుగా లేవుగా?
By: Tupaki Desk | 20 Sep 2022 4:05 AM GMTసంబంధం లేని రెండు సినిమాల్ని పోల్చి చూడటం.. ఆ రెండు సినిమాలకు వచ్చిన వసూళ్లను తూకం వేయటం.. అందులో భాగంగా చేసే వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు బాలీవుడ్ లో కొత్త వేడిని పుట్టించటమే కాదు.. దీనికి కొనసాగింపుగా సంచలన దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.
ఈ ఏడాది బాలీవుడ్ లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. భారీ ఎత్తున వసూళ్లను కొల్లగొట్టిన మూవీగా 'ది కశ్మీర్ ఫైల్స్' నిలిచింది. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లను సాధించింది.
1990లలో జమ్ముకశ్మీర్ లో హిందూ పండిట్లపై జరిగిన మారణకాండ.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న భారీ వలసల్ని కథాంశంగా తీసుకొని నిర్మించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ సంచలనంగా మారటమేకాదు.. మౌత్ టాక్ తో.. ఈ సినిమా వారాల తరబడి థియేటర్లలో ప్రదర్శితమైంది. అతి తక్కువ థియేటర్లలో విడుదలై ఈ మూవీకి అనూహ్యమైన బజ్ రావటంతో.. వారం తర్వాత నుంచి థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ పోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. భారీ బడ్జెట్ తో దాదాపుగా ఐదేళ్ల పాటు చెక్కిన బ్రహ్మాస్త్ర మూవీ ఇటీవల విడదుల కావటం తెలిసిందే. ఈ మూవీ 9 రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లను చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ భారీ మూవీకి రూ200 కోట్ల వసూళ్ల మార్కు బాగానే ఉన్నా.. ఆ మూవీని ఏ మాత్రం సంబంధం లేని కశ్మీర్ ఫైల్స్ తో ముడిపెట్టటం.. ఆ చిత్ర వసూళ్లను బ్రహ్మాస్త్ర అధిగమించిందన్న వార్తల నేపథ్యంలో కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా స్పందించారు.
సోషల్ మీడియాను ఫ్లాట్ ఫాంగా చేసుకొని.. కలెక్షన్లపై వస్తున్న కథనాలపై తన స్పందనను తెలియజేశారు. ''హా.. హా.. వారు ఎలా 'ది కశ్మీర్ ఫైల్స్ ను అధిగమించారోనాకు తెలీదు. రాడ్లు.. రాళ్లు.. ఏకే 47తోనా? డబ్బుల కోసం పీఆర్ లు ప్రచారం చేయటంతోనా? తమ పలుకుబడితోనా? దేనితో మమ్మల్ని ఓడించారో అర్థం కావట్లేదు.
బాలీవుడ్ చిత్రాల్ని ఒకదానితో మరొకటి పోటీ పడనివ్వండి. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. ఆ మూసధోరణి రేసులో నేను లేను' అంటూ ఫైర్ అయ్యాడు. ఆయన ఆగ్రహాన్ని కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు ప్రతికూలంగా రియాక్టు కావటం గమనార్హం. ఏమైనా.. ఏ మాత్రం సంబంధం లేని సినిమాల కలెక్షన్లను సరిపోల్చటం సరైనది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.