Begin typing your search above and press return to search.
వికీ పీడియాని ఏకేసిన వివేక్ అగ్నిహోత్రి
By: Tupaki Desk | 2 May 2022 8:30 AM GMTఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం `ది కాశ్మీరి ఫైల్స్` దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో చెప్పాల్సిన పనిలేదు. 1990 వలసల నేపథ్యంలో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దురాగతాలకు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చారు. సినిమా ఆద్యంత ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిందింది. సినిమాలో ప్రతీ పాత్రని అద్భుతంగా ఆవిష్కరించారు. పాత్రల మధ్య ఎమోషన్ సినిమాకి ప్రధాన అస్సెట్ గా నిలిచింది.
విమర్శకులు సైతం మెచ్చిన గొప్ప చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాపై విమర్శలు అదే స్థాయిలో వచ్చాయి. కొంత మంది సినిమాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అటుపై ఐండీబీ రివ్యూ రేటింగ్ విషయంలో కిందా మీద చేసింది. ముందు ఎక్కువ రేటింగ్ ఇవ్వడం..తర్వాత తగ్గించడం చేసింది. ఓ సెక్షన్ ఆడియన్స్ సినిమాపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలు వేటిని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కౌంటర్లు వేసి నోళ్లు మూయించారు.
అటువైపు నుంచి ఎలాంటి రిప్లై లేకుండా ధీటైన సమాధానాలు ఇవ్వడంలో వివేక్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో వివేక్ ప్రముఖ వెబ్ సైట్ వికీపీడియాని కూడా విడిచిపెట్టలేదు. ట్విటర్ వేదికగా వికీ పై వివేక్ విరుచుకుపడ్డారు. ప్రియమైన వికీపీడియా..ఇస్టామోపోబియా..ప్రచారం..మతోన్మాందం మొదలైన పదాల్ని జోడించడం మర్చిపోయారు.
మీరు మీ సెక్యులర్ భావాలను చూపడంలో విఫలమవుతున్నారు. త్వరపడండి.. ఇంకా ఎడిట్ చేయండి అంటూ ట్వీట్‌ర్ లో వివేక్లల ధ్వజమెత్తారు. ట్విటర్లో తన సినిమా గురించి తప్పుడు ప్రచారం ఉందనే కారణంతోనే వివేక్ ఇలా ప్రతిదాడికి దిగినట్లు తెలుస్తోంది. వికీలో ఉన్న సినిమా సమాచారాన్ని వివేక్ షేర్ చేసారు.
``2022లో వివేక్ అగ్నిహోత్రి రచనా- దర్శకత్వం వహించిన భారతీయ హిందీ-భాషా డ్రామా చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. ఈ చిత్రం వివాదాస్పద కాశ్మీరీ హిందువుల వలసల చుట్టూ కేంద్రీకృతమై కల్పిత కథాంశంతో తెరకెక్కింది. 1990వ దశాబ్దంలో నిర్వాసితులపై మారణ హోమం జరిగినట్లు కల్పిత గాథలను చూపిస్తుంది`. ఇది అసంపూర్ణం..అసంబద్దంగా ఉంది. అందుకే వివేక్ తనదైన శైలిలో వికీపీడియాపై ఎటాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక వివేక్ అగ్ని హోత్రి తదుపరి మరో సంచలనాత్మక ఫైల్స్ తో ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. `ది ఢిల్లీ ఫైల్స్` పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనుల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఈసినిమా కూడా యధావిధిగా కొత్త నటీనటులతో తెరకెక్కిస్తారా? సీనియర్స్ ని ఆశ్రయిస్తారా? అన్నది చూడాలి.