Begin typing your search above and press return to search.
ఏడాదిలోపే రీ రిలీజ్.. ఈసారి ఏమవుతుందో?
By: Tupaki Desk | 18 Jan 2023 5:06 PM GMTప్రస్తుతం సినిమాల రిలీస్ ట్రెండ్ ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎప్పుడో సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలను వివిధ సందర్భాలలో ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు నిర్మాతలు ఇప్పుడు తాజాగా ఒక ఏడాది క్రితం విడుదలైన సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా మరేమిటో కాదు గత ఏడాది మార్చి నెలలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మార్చి 11వ తేదీన హిందీలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
కాశ్మీరి పండితులపై అప్పట్లో జరిగిన మారణకాండను ఆధారంగా చేసుకుని తలకెక్కించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ దక్కింది. ఆ తర్వాత సినిమాని వివిధ దేశీయ భాషల్లోకి డబ్బు చేసి ఓటీడీలో విడుదల చేశాక కూడా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాని జనవరి 19వ తేదీన విడుదల చేస్తున్నామని వెల్లడించారు కాశ్మీరీ హిందువుల ఊచకోత జరిగింది.
ఆ రోజేనని అదే రోజు సినిమా విడుదల చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఒక సినిమా ఏడాది వ్యవధిలో రెండోసారి విడుదల చేయటం ఇదే మొదటిసారి అని ఒకవేళ మా సినిమాని మీరు పెద్ద తెరమీద చూడటం మిస్ అయితే కనుక ఈసారి కచ్చితంగా చూడమని ఆయన సోషల్ మీడియా వేదికగా తమ సినిమా రీ రిలీజ్ విషయాన్ని పంచుకున్నారు.
అంతేకాక దానికి సంబంధించిన బుకింగ్ లింక్స్ కూడా షేర్ చేశారు. ఇక ఈ కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో అనుపంకేర్ కీలక పాత్రలో నటించగా పల్లవి జోషి మరో కీలక పాత్రలో నటించింది. అభిషేక అగర్వాల్ ఆర్ట్స్ జి స్టూడియోస్ అయాం బుద్ధ ప్రొడక్షన్స్ వివేక్ అగ్నిహోత్రి క్రియేట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని జి స్టూడియో సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. తర్వాత జి ఫైవ్ లోనే ఈ సినిమా వివిధ భాషల్లో విడుదలైంది మరి ప్రేక్షకులు మరోసారి ఈ సినిమాని ఎంతలా ఎంకరేజ్ చేస్తారో చూడాలి మొదటిసారి విడుదల చేసినప్పుడు దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేసింది అయితే ఈ సినిమా బడ్జెట్ పాతిక కోట్లు మాత్రమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.