Begin typing your search above and press return to search.

నాని డైరెక్ట‌ర్ మెగాస్టార్ మంత్రం

By:  Tupaki Desk   |   11 Jun 2022 10:37 AM GMT
నాని డైరెక్ట‌ర్ మెగాస్టార్ మంత్రం
X
టాలీవుడ్ లో త‌రాలు మారుతున్నా.. కొత్త త‌రం హీరోలు బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడేస్తున్నా మెగాస్టార్ కున్న క్రేజ్ మెగాస్టార్ దే. ఆయ‌న స్థానాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరూ కొట్ట‌లేదు.. కొట్ట‌లేరు కూడా. స్టార్ హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాంటి వాళ్లే ఈ మాట‌లు అన్నారంటే మెగాస్టార్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. మెగాస్టార్ క్రేజ్ ఏ స్థాయిలో డామినేట్ చేసిందో స్ప‌ష్ట‌మ‌వుతోంది. నిన్న‌టి త‌రానికి మెగాస్టార్ ఓ రోల్ మోడ‌ల్.. అంతే కాకుండా ఆయ‌నే ఇన్సిపిరేష‌న్ కూడా. ఆయ‌న స్ఫూర్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వాళ్లు ఎంద‌రో వున్నారు.

కానీ చాలా మంది ఇటీవ‌ల 'ఆచార్య' ఫ్లాప్ తో చిరు క్రేజ్ త‌గ్గింద‌న‌డంలో ఎలాంటి నిజం లేదు. ఒక్క హిట్టు ప‌డిందా? మళ్లీ అంతా మామూలు అయిపోతుంది. లెక్క‌లు మారిపోతాయి.

బాక్సులు బ‌ద్ద‌ల‌వుతాయి అంటున్నారు యంగ్ డైరెక్ట‌ర్స్. 'అంటే సుంద‌రానికి' చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ కూడా మెగాస్టార్ అంటే త‌న‌కున్న ప్ర‌త్యేక అభిమానాన్ని ఈ మూవీ ద్వారా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక విధంగా చెప్పాలంటే మెగాస్టార్ మంత్రాన్ని జ‌పించార‌ని చెప్పొచ్చు.

ఈ మూవీలోని చిన్న‌నాటి నాని ఎపిసోడ్ నే ఇందుకు మంచి ఎగ్జాంపుల్ గా తీసుకోవ‌చ్చు. ఈ ఎపిసోడ్ లో చిన్న‌నాటి నానిగా డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ త‌న‌యుడు నిమ్మి న‌టించాడు. చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లో నిమ్మిని మెగాస్టార్ కు వీరాభిమానిగా చూపించ‌డం ఇప్పుడు పులువురి దృష్టిని ఆక‌ర్షించింది. దాదాపు 10 నిమిషాల పాటు మెగాస్టార్ ని గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. మెగాస్టార్ మంత్రం జ‌పిస్తూనే సినిమా 1999లో జ‌రుగుతోంద‌ని, అప్ప‌ట్లో చిరుని జ‌నం ఎంత‌గా అభిమానించి ఆరాధించేవారో స్ప‌ష్టం చేశారు.

ఈ ఎపిసోడ్ మెగా అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఫ్యాన్స్ ఈ స‌న్నివేశాల‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా ప‌లువురు ద‌ర్శ‌కులు చిరుని ప‌లు ర‌కాలుగా గుర్తు చేస్తూ సీన్స్ రాస్తే వివేక్ ఆత్రేయ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి మెగాస్టార్ ని గుర్తు చేయ‌డం విశేషం.

ఇదిలా వుంటే యంగ్ డైరెక్ట‌ర్స్ చాలా మంది చిరుతో క‌లిసి 'ఆచార్య' రిలీజ్ టైమ్ లో ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేయ‌డం తెలిసిందే. ఈ స్థాయిలో యంగ్ హీరోలు, స్టార్ హీరోలు, నేటి త‌రం ద‌ర్శ‌కుల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ మెగాస్టార్ గురించి ప్ర‌త్యేకంగా గుర్తు చేసుకోవ‌డం విశేషం.