Begin typing your search above and press return to search.
కల్యాణ్ గారు రావడం కంటే సెలబ్రేషన్ ఏవుంటుంది?: వివేక్ ఆత్రేయ
By: Tupaki Desk | 10 Jun 2022 4:07 AM GMT మొదటి నుంచి కూడా వివేక్ ఆత్రేయ దర్శకుడిగా విభిన్నమైన మార్గంలో వెళుతున్నాడు. 'బ్రోచేవారెవరురా' సినిమా ఆయన సత్తాను చాటుతుంది. పూర్తి వినోదభరితమైన సినిమాగా అది ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సారి కూడా అదే తరహాలో ఆయన పూర్తి వినోదభరితమైన కథాంశంతో 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. నాని - నజ్రియా జంటగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై వివేక్ ఆత్రేయ మాట్లాడాడు.
"మా టీమ్ అంతా కూడా ఈ సినిమాను చూసేశాం .. అందరం కూడా పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. మా టీమ్ అంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని ఆలోచన చేస్తుంటే, నిర్మాతలు వచ్చి మన ఫంక్షన్ కి కల్యాణ్ గారు చీఫ్ గెస్టుగా వస్తున్నారు అని చెప్పారు.
అప్పుడు నాకు అనిపించింది .. కల్యాణ్ గారు రావడం కంటే సెలబ్రేషన్ ఏవుంటుంది? అని. నా జీవితంలో నేను రెండుసార్లు గర్వపడిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి నేను జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చినప్పుడు. రెండోసారి నేను ఈ సినిమా ఫస్టు కాపీ చూసినప్పుడు.
ఈ వేదిక ద్వారా ముందుగా నానిగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఆ రోజున ఆయన స్క్రిప్ట్ ఓకే చేయకపోతే ఈ రోజున నేను ఇక్కడి వరకూ వచ్చి ఉండేవాడిని కాదు. నజ్రియా గారితో పాటు ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ సహకరించినందుకు వల్లనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.
మా డైరెక్షన్ టీమ్ నిద్రాహారాలు మానేసి వర్క్ చేయడం వల్లనే ఈ సినిమా అవుట్ పుట్ అనుకున్నట్టుగా వచ్చింది. వివేక్ సాగర్ బాణీలు .. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు.
కల్యాణ్ గారి క్రేజ్ గురించి ఒక మాట చెబుతాను. చాలాకాలం క్రితం ఒకసారి నేను నరసారావు పేటలోని మా బామ్మ వాళ్లింటికి వెళ్లాను. అక్కడ రోడ్లన్నీ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. రోడ్లన్నీ ఏంట్రా బాబూ ఇంత ఖాళీగా ఉన్నాయి .. ఈ రోజు ఏమైనా బంద్ ఉందా అని ఆశ్చర్యపోయాను. ఆ తరువాత తెలిసింది ఆ రోజున టీవీలో 'తొలిప్రేమ' సినిమాను ఫస్టు టైమ్ ప్రసారం చేస్తున్నారని. దీనిని బట్టి పవన్ సార్ కి అప్పట్లోనే ఎంత క్రేజ్ ఉందనేది నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.