Begin typing your search above and press return to search.

5 లక్షల ఇళ్లు కట్టించబోతున్న హీరో

By:  Tupaki Desk   |   19 Sep 2016 7:16 AM GMT
5 లక్షల ఇళ్లు కట్టించబోతున్న హీరో
X
‘రక్త చరిత్ర’లో పరిటాల రవి పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. అతను చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా అందరికీ బాగానే తెలుసు. అప్పట్లో కర్నూలు వరదల్లో మునిగిపోయిన సమయంలో అక్కడికి వచ్చి తన వంతుగా విరాళం కూడా ఇచ్చాడు వివేక్. ముంబయిలో మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాడు అతను. తాజాగా లాభం ఆశించకుండా ఒక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును చేపట్టాలని అతను నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్రలో తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం తక్కువ ఖర్చులో ఇళ్లు నిర్మించడానికి అతను ముందుకొచ్చాడు.

2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటను స్ఫూర్తిగా తీసుకుని వివేక్ ఈ ప్రాజెక్టు చేపడుతున్నాడు. ఈ ఏడాది చివరికి 5 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పాడు. మిషన్ 360 పేరుతో మహారాష్ట్ర వ్యాప్తంగా 360 ప్రాంతాల్లో ప్రాజెక్టు చేపడతామని వివేక్ తెలిపాడు. లాభాలు ఆశించకుండా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇంటి ధరను 7,90,000 రూపాయలుగా నిర్ణయించామని తెలిపాడు. ఈ ప‍్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పాడు. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి భూమి తీసుకోలేదని.. ప్రైవేటు వ్యక్తుల నుంచే సేకరించామని తెలిపాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని.. ప్రస్తుతానికి మహారాష్ట్రలో ప్రాజెక్టు పూర్తిచేసి.. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల గురించి ఆలోచిస్తామని వివేక్ తెలిపాడు.