Begin typing your search above and press return to search.
బాలీవుడ్ నటుడు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది!
By: Tupaki Desk | 21 May 2019 9:17 AM GMTసోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణమైన నెటిజనుల సంగతేమో కానీ సెలబ్రిటీలు మాత్రం డబల్ కేర్ఫుల్ గా ఉండడం అవసరం. లేకపోతే లేనిపోని వివాదాలలో చిక్కుకోవాల్సి వస్తుంది. పబ్లిసిటీ కోసం 'కావాలని' వివాదం సృష్టిస్తే పర్వాలేదు కానీ అలా కాకపోతే అపాలజీ వరకూ వెళ్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విషయంలో అలానే జరిగింది.
మన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జస్ట్ పోటీ చేసిన అన్ని పార్టీలు గెలుస్తారని అంటున్నారు కానీ కొద్ది రోజుల తర్వాత ఇండియా ఎలెక్షన్స్ కు సంబంధం లేని ట్రంప్.. ఇమ్రాన్ ఖాన్.. కిమ్ ఉన్ జోంగ్ మన ఎన్నికల్లో గెలుస్తారని కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చేలా ఉన్నాయి. అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి. అలాంటి మీమ్స్ లో ఒకదాన్ని వివేక్ ఓబెరాయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. అదే మీమ్ ఒక సాధారణ వ్యక్తి షేర్ చేసి ఉంటే పెద్దగా వివాదం ఉండేది కాదు. కానీ వివేక్ షేర్ చేయడంతో విమర్శకులు విరుచుకుపడ్డారు. ఇది ఐశ్వర్యరాయ్ ను అవమానించడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయింది.
వివేక్ కు గట్టిగా హీట్ తగలడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేసి క్షమాపణ కోరాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఒక్కోసారి పైకి సరదాగా.. హానిలేదని అనిపించేది ఇతరులకు అలా అనిపించకపోవచ్చు. నేను గత పదేళ్ళుగా పేద బాలికల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాను. నేను ఒక మహిళను అగౌరవపరచడం గురించి కనీసం ఊహించలేను. అయితే నేను ఆ మీమ్ ద్వారా.. దానికి నా రిప్లై దారా ఒక్క మహిళ మనసునైనా నొప్పించి ఉంటే నేను దానికి క్షమాపణ చెప్పాలి. ట్వీట్ డిలీట్ చేశాను. క్షమాపణలు" అంటూ ట్వీట్ చేశాడు.