Begin typing your search above and press return to search.
చరణ్ రేంజ్ లో విలన్ రెమ్యునరేషన్
By: Tupaki Desk | 17 Feb 2018 5:22 AM GMTవిలన్ ఎంత బలంగా ఉంటె హీరో రేంజ్ అంత పెరుగుతుందని మాస్ దర్శకులకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే వారి సినిమాల్లో సినిమా స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా విలన్స్ కనిపిస్తారు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ దర్శకులు విలన్స్ ని చూపించడంలో చాలా గ్రేట్ అని నిరూపించుకున్నారు. ఆడియెన్స్ కూడా హీరోని ఎంతగా లైక్ చేస్తారో విలన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కోసారి విజిల్స్ వేస్తారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా తన ప్రతి కథలో విలన్లను చాలా వైలెంట్ గా చూపిస్తాడు. వారి కోసం స్పెషల్ గా కొన్ని సీన్లను కూడా రాసుకుంటాడు. ఆ తరువాత హీరో పాత్రపై ఎక్కువగా ఆలోచిస్తాడట ఈ దర్శకుడు. రీసెంట్ గా రామ్ చరణ్ తో బోయపాటి ఒక మాస్ కథను ఒకే చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కథలో విలన్ పాత్ర చాలా కీలకమట. అందుకోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ని ఫిక్స్ చేసుకున్నాడు.
వివేక్ కి పాత్ర చాలా నచ్చిందట. కానీ పాత్ర చాలా వైలెంట్ గా ఉండడంతో కొంచెం ఎమౌంట్ కూడా గట్టిగానే అడిగాడని తెలుస్తోంది. దాదాపు మన దగ్గర మీడియం హీరోలు తీసుకునే రేంజ్ రూ.3కోట్ల వరకు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసాడట. దీంతో నిర్మాతలు మొదట ఆలోచించిన దర్శకుడిని నమ్మి ఒకే చేశారని సమాచారం. ఇక హీరోయిన్ గా కైరా అద్వానీని సెట్ చేశారు. ఆ భామకు కూడా ఎమౌంట్ గట్టిగానే ఇస్తున్నారని సమాచారం. మరి బోయపాటి పెట్టిస్తోన్న ఖర్చు నిర్మాతలకు ఎంతవరకు లాభాన్ని ఇస్తుందో చూడాలి.