Begin typing your search above and press return to search.
20 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నానంటూ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 7 Dec 2021 4:30 PM GMTబాలీవుడ్ లో ఏదో ఒక సందర్బంలో ఎవరో ఒకరు నెపోటిజం గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఈ పదానికి బ్రాండ్ అంబాసిడర్ కంగనా రనౌత్ అనడంలో సందేహం లేదు. ఆ పదంతో ఎంతో మంది స్టార్ కిడ్స్ ను స్టార్స్ ను ఒక ఆట ఆడేసిన కంగనా రనౌత్ ఈమద్య కాలంలో కాస్త సైలెంట్ అయ్యింది. మళ్లీ ఆమె ఆ విషయంమై స్పందించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఒక వైపు సందర్బానుసారంగా నెపోటిజం పై వ్యాఖ్యలు చేస్తూ ఉండగానే మరో వైపు ఎవరో ఒకరు నెపోటిజం పై మాట్లాడుతూ ఉంటారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ ఈ విషయమై స్పందించాడు. ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఖచ్చితంగా ఉంది అన్నట్లుగా తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు.
ఇండస్ట్రీలో నేను అడుగు పెట్టి 20 ఏళ్లు అవుతుంది. ఈ సమయంలో ఎన్నో సక్సెస్ లు దక్కించుకున్నా.. ఎన్న సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాను. అయినా ఇప్పటికి కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్నా కూడా నా కెరీర్ కష్టంగానే నెట్టుకు పోవాల్సి వస్తుందని వివేక్ ఒబేరాయ్ అన్నాడు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రేమ వ్యవహారం... స్టార్ హీరోతో గొడవల కారణంగా ఆయన కెరీర్ డౌన్ ఫాల్ మొదలు అయ్యింది. అప్పటి నుండి మళ్లీ వివేక్ ఒబేరాయ్ బాలీవుడ్ లో స్టార్ గా ఉన్నా కూడా భారీ చిత్రాలు ఆయనకు రాలేదు. పేరుకు స్టార్ నటుడు హీరో అయినా కూడా ఆయన తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆసక్తి చూపడం లేదు అనేది బాలీవుడ్ మీడియా వర్గాల టాక్.
ప్రస్తుతం ఈయన వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నాడు. ఇన్ సైడ్ ఎడ్జ్ 3వ సీజన్ స్ట్రీమింగ్ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన వివేక్ ఒబేరాయ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే.. స్టార్ లు అవ్వాలంటే వారి పేరు కు ముందు ప్రముఖుల పేర్లు ఉండాలి.. లేదంటే ప్రముఖుల ఇంటికి చెందిన వారు అయినా అయ్యి ఉండాలి.. అది కాదంటే ప్రముఖులకు చెందిన సన్నిహితులు లేదా స్నేహితులు అయినా అయ్యి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. వారికి ప్రతిభ ఆధారంగా ఆఫర్లు రావు. వారి పేరు ఆధారంగా.. వారి వెనుక ఉన్న వ్యక్తుల ఆధారంగా ఆఫర్లు వస్తూ ఉంటాయి.
బాలీవుడ్ లో సొంత ట్యాలెంట్ తో నెగ్గుకు రావడం.. స్టార్ అవ్వడం.. సక్సెస్ అవ్వడం.. హీరోగా నిలబడటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం అన్నట్లుగా వివేక్ ఒబేరాయ్ అన్నాడు. విబేక్ ఒబేరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. రక్త చరిత్ర తో పాటు వినయ విధేయ రామ సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన పలు సినిమా లు తెలుగు లో డబ్ కూడా అయ్యాయి.