Begin typing your search above and press return to search.
వర్మను నమ్ముతున్నావ్.. జాగ్రత్త నాయనా
By: Tupaki Desk | 23 March 2016 5:30 PM GMTరామ్ గోపాల్ వర్మ తనదైన ఫామ్ చూపించి చాలా కాలం అయింది. బాలీవుడ్ లో తన మార్కెట్ పూర్తిగా పడిపోయాక టాలీవుడ్ కు వచ్చి.. ఇక్కడో నాలుగైదేళ్లు మకాం వేశాడు. ఇక్కడ ఆయన స్థాయి మరీ దారుణంగా పడిపోయింది. ఐస్ క్రీమ్ - 365 డేస్ లాంటి వర్మ స్థాయికి ఏమాత్రం తగని సినిమాలు తీశాడాయన. ఐతే ఈ మధ్యే ‘కిల్లింగ్ వీరప్పన్’లో మళ్లీ కొద్దిగా వర్మ ముద్ర కనిపించింది. ఆ ఊపులో తిరిగి బాలీవుడ్ కు మకాం మార్చేశాడు. ప్రస్తుతం ఆయన బేస్ ముంబయే. దావూద్ ఇబ్రహీం జీవితం నేపథ్యంలో ‘గవర్నమెంట్’ అనే సినిమా తీయడానికి వర్మ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది కాక ఇంకో రెండు ప్రాజెక్టుల్ని కూడా వర్మ లైన్ లో పెట్టడం విశేషం. వీటన్నింటికీ నిర్మాతల్ని కూడా రెడీ చేసుకున్నాడు.
ఆ నిర్మాతల్లో ఒకరు వివేక్ ఒబెరాయ్. ఈ హీరో వర్మ కోసమే నిర్మాత అవతారం ఎత్తుతున్నాడు. వర్మ - వివేక్ కాంబినేషన్ లో ఇంతకుముందు తెరకెక్కిన ‘కంపెనీ’ బాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. తర్వాత ‘రక్తచరిత్ర’ తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ అనుభవంతో వర్మ దర్శకత్వంలో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చేశాడు వివేక్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో కంపెనీ-2 తెరకెక్కబోతోంది. ఐతే బాలీవుడ్ లో ప్రస్తుతం వివేక్ పరిస్థితి ఏమంత బాగా లేదు. హీరోగా అతడికి అవకాశాలు లేవు. ప్రత్యేక పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నాడు. ఇలాంటి టైంలో వర్మను నమ్మడం సాహసమే. ఐతే వివేక్ మాత్రం.. గ్యాంగ్ స్టర్ - క్రైమ్ సినిమాలు తీయడంలో వర్మను మించినవాడు లేడని.. ఆయనో మేధావి అని.. తిక్క ఉన్న తెలివైనవాడని తన దర్శకుడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. కంపెనీ-2 స్క్రిప్టు కూడా బాగా వస్తోందని.. ఈ సినిమాతో మళ్లీ బాలీవుడ్ కు వర్మ అంటే ఏంటో తెలుస్తుందని అన్నాడు వివేక్. ఐతే బాలీవుడ్ లో భారీగా ఉన్న వర్మ వ్యతిరేక వర్గం మాత్రం.. బాలీవుడ్ కు వర్మ ఏంటో తెలియడం కాదు కానీ.. వర్మ అంటే ఏంటో వివేక్ కు బాగా తెలిసొస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మరి వర్మ వివేక్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.