Begin typing your search above and press return to search.

#క‌శ్మీర్ ఫైల్స్ .. 30ఏళ్ల నాటి మార‌ణ‌హోమంలో నిజాలేమిటి?!

By:  Tupaki Desk   |   17 Dec 2020 2:30 AM GMT
#క‌శ్మీర్ ఫైల్స్ .. 30ఏళ్ల నాటి మార‌ణ‌హోమంలో నిజాలేమిటి?!
X
ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌క‌నిర్మాత వివేక్ అగ్నిహోత్రి చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్` ఆగస్టు 2020 లో విడుదల కావాల్సి ఉండ‌గా.. మ‌హ‌మ్మారీ వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాశ్మీరీ హిందువుల మారణహోమం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. వివాదాల‌తో ముడిప‌డిన‌ సంచ‌ల‌నాలకు తావివ్వ‌నున్న‌ చిత్రంగా భావిస్తున్నారు.

కాశ్మీర్ ఫైల్స్ ‌లో కాశ్మీరీ హిందువుల అత్యంత విషాదకరమైన మారణహోమంపై బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని కథను మీ ముందుకు తీసుకువస్తాము. ఇది మాట‌ల్లో చెప్పడానికి సులభమైన కథ కానందున మా బృందాన్ని ఆశీర్వదించండి అంటూ ఇంత‌కుముందు అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. మూవీ పోస్టర్ ‌ను కూడా ఆయ‌న‌ పంచుకున్నారు. ఇందులో కాశ్మీర్ మ్యాప్ .. నారింజ షేడ్ తో పోస్ట‌ర్ ఉత్కంఠ‌ను పెంచింది.

1966 లో లాల్ బహదూర్ శాస్త్రి మర్మమైన మరణం చుట్టూ తిరిగేది తాష్కెంట్ ఫైల్స్ ను దర్శకుడు అగ్నిహోత్రి ఇంతకుముందు తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. భారతదేశం - పాకిస్తాన్ మధ్య 1965 యుద్ధాన్ని ముగించడానికి తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్న అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల‌పై సినిమా అది. ఇప్పుడు క‌శ్మీర్ ఫైల్స్ అదే త‌ర‌హాలో వివాదాస్ప‌ద క‌థాంశంతోనే రూపొందుతుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

అగ్నిహోత్రి త‌న సినిమా గురించి ప్ర‌స్థావిస్తూ...``ఈ స్క్రిప్ట్ 30 సంవత్సరాల క్రితం కాశ్మీర్ లో రాసిన‌ది. బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్పని కథను ప్రజల్లోకి తీసుకురావడం నా బాధ్యత అని నేను భావిస్తున్నాను అన్నారు. అనుప‌మ్ ఖేర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం ఏఏఏ ఆర్ట్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతోంది.