Begin typing your search above and press return to search.

11 భాష‌ల్లో వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి మ‌రో సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   10 Nov 2022 7:21 AM GMT
11 భాష‌ల్లో వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి మ‌రో సంచ‌ల‌నం!
X
కశ్మీరీ పండిట్ల ఊచ‌కోత నేప‌థ్యంలో వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'ది క‌శ్మీర్ ఫైల్స్‌'. అనుప‌మ్ ఖేర్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, ప‌ల్ల‌వి జోషీ వంటి తార‌లు న‌టించిన ఈ మూవీ ఊహించని స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిం చింది. 15 కోట్ల పై చిలుకు బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. కశ్మీరీ పండిట్ల ఊచ‌కోత నేప‌థ్యంలో 1989 - 90 మ‌ధ్య కాలంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌కు స‌జీవ సాక్ష్యంగా నిలిచింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 340 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాలీవుడ్ మేక‌ర్స్ తో పాటు అన్ని భాష‌ల‌కు చెందిన మేక‌ర్స్ ని, ట్రేడ్ వ‌ర్గాల‌ని ఒక్క‌సారిగా షాక్ కు గురిచేసింది. ఈ మూవీని తెలుగు ప్రొడ్యూస‌ర్ అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. ఈ మూవీతో ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత‌, న‌టి ప‌ల్ల‌వి జోషీ క‌లిసి తాజాగా మ‌రో సంచ‌ల‌న చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి త‌న త‌దుప‌రి సినిమా టైటిల్ గురించి పోస్ట్ చేస్తూ ది ...వార్‌' అని వెల్ల‌డించి ఆ ఖాలీని పూరించి సినిమా టైటిల్ ని క‌నిపెట్టండ‌ని ప్రేక్ష‌కుల‌కు ఓ ప‌జిల్ వేశారు.

గురువారం పూర్తి టైటిల్ ని ప్ర‌క‌టిస్తూ ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశాడు. సినిమా పేరు 'ది వ్యాక్సిన్ వార్' అని ప్ర‌క‌టిస్తూనే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌ని జోడించాడు. 'ది వ్యాక్సిన్ వార్' ని ప్ర‌జెంట్ చేస్తున్నాం. దీని కోసం ఇండియా ఎంత‌గా ఫైట్ చేసిందో మీకు తెలియ‌ని ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ని చెప్ప‌బోతున్నాను.

అంతే కాకుండా ఈ వార్ లో ఇండియా దాని పైన్స్‌, ధైర్యం, గొప్ప భార‌తీయ విలువ‌ల‌దో గెలిచింది. ఈ సినిమాని 2023 స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ఆగ‌స్టు 15న మొత్తం 11 భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నాం' అని వెల్ల‌డించారు.

ఈ సినిమా దేశంలో కోవిడ్ 19 టీకా కోసం చేసిన క‌స‌ర‌త్తుల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర అధ్యాయ‌నాల గురించి చ‌ర్చించ‌బోతున్న‌ట్టుఆ టైటిల్ ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. కోవిడ్ పై పోరులో మ‌న దేశం ఏం సాధించింది.. వ్యాక్సిన్ కోసం ఎలాంటి పోరాటం చేసింద‌న్న‌ది ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి మాట‌ల‌ని బ‌ట్టి తెలుస్తోంది.

ఈ సినిమాని హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, గుజ‌రాతీ, మ‌రాఠీ, పంజాబీ, భోజ్ పురి, బెంగాలీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, ఉర్దూ, అస్సామీ వంటి భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అయామ్ బుద్ద ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ప‌ల్ల‌వి జోషి ఈ మూవీని నిర్మిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగ‌ర్వాల్ ప‌లు భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా మ‌న అద్భుత‌మైన జీవ‌శాస్త్ర‌వేత్త‌ల విజ‌యాన్ని తెలుపుతుంది. టీకా యుద్దంలో వారి త్యాగం, అంకిత భావం, మ‌రియు కృషికి మా నివాళిగా ఈ సినిమాని నిర్మిస్తున్నామ‌ని ప‌ల్ల‌వి జోషి తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.