Begin typing your search above and press return to search.
మేకర్స్‌కి 'ద కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ కొత్త సూచన!
By: Tupaki Desk | 12 Sep 2022 6:32 AM GMTకశ్మీర్‌లో కొన్నేళ్ల క్రితం హిందులపై మరీ ముఖ్యంగా పడింట్ లపై జరిగిన మారణ హోమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా కొంత మంది ఆస్తులు, నివాసాలు కోల్పోయి శరనార్థులుగా మారారు. ఈ ధీనగాథ వెనకున్న చీకటి కోణాన్ని ప్రపంచానికి పరిచం చేస్తూ వివేక్ రంజన్ అగ్ని హోత్రి తెరకెక్కించిర సంచలన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంలచనం సృష్టించింది.
సైలెంట్ గా విడుదలైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. కనీ వినీ ఎరుగని విధంగా రూ. 297 కోట్లు వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాల విస్మయానికి గురిచేసి సంచలనం సృష్టించింది.
బాలీవుడ్ లో భారీ వసూళ్లని సాధించిన బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిని టాప్ సెలబ్రిటీగా నిలబెట్టింది. దర్శకుడిగా ఒకే ఒక్క మూవీతో మరింతగా పాపులర్ అయ్యేలా చేసింది.
దీనికి తోడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే పోస్ట్ లు కూడా వైరల్ అవుతుండటం, బాలీవుడ్ సెలబ్రిటీలపై పదునైన విమర్శలు చేస్తున్న తీరుతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి నిత్యం హాట్ టాపిక్ గా మారడం మొదలైంది. తాజాగా బెంగళూరులో జరిగిన సైమా అవార్డుల్లో పాల్గొన్న వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్టర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.
సైమా అవార్డుల్లో కన్నడ మూవీ 'బడవరాస్కెల్' మూవీ డైరెక్టర్ శంకర్ గురు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా కన్నడ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అంటూ అతన్ని పిలవడంతో స్టేజ్ పైనే వున్న వివేక్ రంజన్ అగ్నిహోత్రి అభ్యంతరం చెప్పాడు.
'ఉత్తమ కన్నడ లేదా తెలుగు దర్శకుడు అని కాకుండా కన్నడ భాషలో ఉత్తమ భారతీయ దర్శకుడు అని సంబోధించడం మంచిదని ఇకపై ఆ బారియర్స్ ని అధిగమించి ఇలా పిలుచుకుందామని అందరికి సలహా ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇచ్చిన సూచనపై హర్షాన్ని వ్యక్తం చేయడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.