Begin typing your search above and press return to search.
చెర్రీ విలన్ మోదీ పాత్రలో
By: Tupaki Desk | 1 Jan 2019 4:28 AM GMTగత కొంతకాలంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పలువురు దర్శకులు సంచలనాల మోదీజీ జీవితాన్ని వెండితెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నారని కథనాలు వచ్చాయి. అయితే ఇదీ క్లియర్ కట్ మ్యాటర్ అంటూ ఇప్పటికీ సమాచారం లేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఒమంగ్ కుమార్ పూర్తి క్లారిటీతో ఈ బయోపిక్ కోసం రెడీ అవుతున్నారట. గత కొంతకాలంగా నరేంద్ర మోదీ బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్టును ఒమంగ్ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధమై ప్రీప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. ఈ జనవరిలో కొత్త సంవత్సర కానుకగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.
అయితే మోదీ పాత్రలో ఎవరు నటిస్తారు? అంటే గ్రేట్ యాక్టర్, రక్త చరిత్ర ఫేం వివేక్ ఒబేరాయ్ మోదీగా నటిస్తారని చెబుతున్నారు. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన చరిత్ర ఇది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఎదురే లేనివాడిగా పరిపాలన సాగించి, అటుపై భారతదేశానికే ప్రధాని అయ్యారు. అలాంటి గొప్ప నాయకుని పాత్రలో నటించడం అంటే ఓ సవాల్ అనే చెప్పాలి. ఒబేరాయ్ తో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఒమంగ్ కుమార్ అందుకు సంబంధించిన మంతనాలు సాగిస్తున్నారట. అధికారికంగా ప్రాజెక్టును కన్ఫామ్ చేయాల్సి ఉందింకా.
బాలీవుడ్ లో అడపాదడపా ఇంపార్టెంట్ రోల్స్ మాత్రమే అంగీకరిస్తున్న ఒబేరాయ్ సామాజిక సేవలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. టాలీవుడ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న `వినయ విధేయ రామ` చిత్రంలో విలన్ గా నటించారు. ఈ సినిమా సంక్రాంతికి రానుంది. తెలుగు తో పాటు అటు తమిళం, కన్నడలోనూ వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి ఆయన ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవి పాత్ర పోషించిన ఒబెరాయ్.. ఇప్పుడు దేశ ప్రధాని మోదీ పాత్రలో నటిస్తున్నారు అంటే తెలుగు ఆడియెన్ లోనూ ఆసక్తి నెలకొంటుందనడంలో సందేహం లేదు.