Begin typing your search above and press return to search.
అఖిల్ బాబుకి అభిమానుల కంప్లెయింట్
By: Tupaki Desk | 4 Jan 2018 9:48 AM GMTఅక్కినేని వంశానికి నవతరం వారుసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. అభిమానుల అంచనాల మేరకు రాణించలేకపోతున్నాడు. మనం మూవీలో ఒక్కసీన్ లో కనిపించి ఎన్నో ఆశలు కల్పించిన ఈ హీరో.. అఖిల్ తో అరంగేట్రంలోనే డిజప్పాయింట్ చేశాడు. లాంగ్ బ్రేక్ తీసుకుని మరీ చేసిన హలో మూవీకి టాక్ బాగున్నా.. పెట్టిన ఖర్చు- అమ్మిన రేట్ల ప్రకారం ఇది కూడా ప్లాప్ అనిపించుకుంటోంది.
ఇలా ఎందుకు జరిగిందనే ఆరాలు మొదలైపోయాయి. ఇలాంటి సమయంలో విశాఖపట్నంకు చెందిన అక్కినేని అభిమానులు.. అఖిల్ కు ఓ ఓపెన్ లెటర్ రాశారు. ఇందులో రాసిన కొన్ని పాయింట్స్ చూస్తే.. ఈ ఫెయిల్యూర్స్ కు కూడా కొన్ని కారణాలు కనిపించక మానవు. అప్పట్లో ఊపిరి ఆడియో ఫంక్షన్ జరిగినపుడు హైద్రాబాద్ లో ఈ ఈవెంట్ నిర్వాహకులు.. రెండు రాష్ట్రాల్లో అక్కినేని ఫ్యాన్స్ అంతా కలిపి 3వేల మంది ఉండరంటూ కామెంట్ చేశారని తెలిపారు. వైజాగ్ లో జరిగిన హలో ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయిందని.. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారని ఈ లేఖలో చెప్పుకొచ్చారు. గతంలో వైజాగ్ లో లక్షలాది మంది ఫ్యాన్స్ ఉండేవారని.. కానీ ఇప్పుడది వేల సంఖ్యకు పడిపోవడానికి కారణం.. కంపెనీకి వెనక ఉంటున్నవారే అని ఆరోపించారు.
అలాగే అఖిల్ చిత్రాన్ని వైజాగ్ ఏరియాలో 100 థియేటర్లలో విడుదల చేయగా.. ఇప్పుడు సొంత డిస్ట్రిబ్యూటర్ అయినా సరే.. ఎంసీఏ మేకర్స్ తో కుమ్మక్కు అయిపోయి.. కేవలం 53 థియేటర్లలో ప్రదర్శించడంతో.. వసూళ్లపై తీవ్ర ప్రభావం కనిపించిందని ఫిర్యాదు చేశారు అక్కినేని అభిమానులు.