Begin typing your search above and press return to search.
అంతరిక్షం చివరిలో ఈ ట్విస్టేంటో?
By: Tupaki Desk | 16 Dec 2018 6:57 AM GMTఈ శుక్రవారం మూడు సినిమాలు క్రేజీగా ఒకదానితో ఒకటి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో దేనికదే ప్రత్యేక జోనర్ కావడం - ట్రైలర్లు ఆసక్తి పెంచడంతో ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ `అంతరిక్షం` - శర్వా- హను రాఘవపూడిల `పడి పడి లేచే మనసు` - యశ్ - ప్రశాంత్ నీల్- సాయి కొర్రపాటిల `కె.జి.ఎఫ్` చిత్రాలు ఇప్పటికే బజ్ క్రియేట్ చేశాయి. ఆ క్రమంలోనే ఈ సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. వీటన్నిటిలో స్పేస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న `అంతరిక్షం`పై జనాల కళ్లన్నీ!!
పడి పడి లేచే మనసు ప్రీరిలీజ్ ఈవెంట్ కి బన్ని విచ్చేస్తుంటే - అంతరిక్షం ప్రీరిలీజ్ ఈవెంట్ కి చరణ్ విచ్చేస్తుండడంతో అభిమానుల కళ్లు ఈ ప్రచార వేడుకలపైనా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో `అంతరిక్షం` ప్రీబిజినెస్ గురించి ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అన్ని ఏరియాల బిజినెస్ బావున్నా.. ఎందుకనో ఈ సినిమా వైజాగ్ బిజినెస్ చివరి నిమిషంలో డీలా పడడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
సినిమాల కలెక్షన్స్ కి ఎంతో కీలకమైన వైజాగ్- ఉత్తరాంధ్ర ఏరియా హక్కుల కోసం ఆంధ్రా ఏరియా డిస్ట్రిబ్యూటర్ బీన్జ్ అర్జున్ పోటీపడ్డారు. ఠఫ్ కాంపిటీషన్ లో `అంతరిక్షం 9000కెఎంపిహెచ్` హక్కుల్ని ఆయన రూ.8 కోట్లకు చేజిక్కించుకున్నాడని ఇటీవల ప్రచారమైంది. కానీ ఎందుకనో అతడు చివరి నిమిషంలో వెనకాడాడని తెలుస్తోంది. అందుకు కారణమేంటి? అంటే ఈ సినిమా ఓ ప్రయోగం కావడం ఓ కారణం అనుకుంటే - భారీ కాంపిటీషన్ నడుమ రిలీజవుతోంది కాబట్టి ఏం జరుగుతుందోనని కంగారు పడ్డాడట. దీంతో డీల్ విషయంలో వెనకాడాడని చెప్పుకుంటున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ ట్విస్టేంటి? అంటూ ట్రేడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఘాజీ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంకల్ప్ రెడ్డి ఈసారి `అంతరిక్షం` చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడో చూడాలన్న ఆసక్తికర చర్చ సాగుతుంటే ఈ ట్విస్టేంటి? అన్న మాటా మంతీ సాగుతోంది.