Begin typing your search above and press return to search.

సముద్ర తీరంలో మహర్షి లొల్లి ?

By:  Tupaki Desk   |   6 May 2019 5:55 AM GMT
సముద్ర తీరంలో మహర్షి లొల్లి ?
X
టాలీవుడ్ లో స్టార్ హీరోల భారీ సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలను 30 నుంచి 100 దాకా అదనంగా పెంచేసి మొదటి రెండు వారాలను ఎన్ క్యాష్ చేసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచో సాగుతున్నదే. దానికి ఎంత బడ్జెట్ అయ్యింది అనే దానితో సంబంధం లేకుండా కేవలం హీరో ఇమేజ్ ని బట్టి ఇలా పెంచుకుంటూ పోయే వెసులుబాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉంది.

తెలంగాణాలో బెనిఫిట్ షోలకు అనుమతులు విపరీతంగా ధరలు పెంచుకునే అనుమతులు ఇవన్ని ఎప్పుడో మానేశారు. ఇప్పుడిదే కొన్ని చోట్ల ముఖ్యంగా వైజాగ్ ప్రాంతంలో మహర్షి స్క్రీనింగ్ కు ఇబ్బందులు తెస్తున్నాయని అప్ డేట్. దాని ప్రకారం జిల్లా యంత్రాంగం మహర్షి టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చినా అక్కడి సింగల్ స్క్రీన్ ధియేటర్ల ఓనర్లు దానికి ససేమిరా అంటున్నారట. అలా పెంచితే తమవి మల్టీ ప్లెక్సుల రేట్లు ఇంచుమించు ఒకేలా ఉంటున్నాయని దాని వల్ల జనం సహజంగానే వాటికే మొగ్గు చూపుతున్నారని వాళ్ళ వెర్షన్.

అంతే కాదు ఎవరైనా దీని మీద కేసు పెడితే అది తమకే చుట్టుకుంటుంది తప్ప బయ్యర్లకు ఎలాంటి చిక్కులు ఉండవు అనేది వాళ్ళ కంప్లయింట్. అయితే విడుదలకు ఇంకా మూడు రోజులే ఉన్న నేపధ్యంలో ఇలా బెట్టు చేస్తున్న వైజాగ్ ధియేటర్ల సమాఖ్యతో చర్చించేందుకు దిల్ రాజు స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు టాక్. మొత్తానికి ఏదో ఒక రూపంలో మహర్షికి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు తప్పడం లేదు