Begin typing your search above and press return to search.

వైజాగ్..ఒంగోలు ద‌ద్ద‌రిల్లేలా వీర‌య్య‌...బాల‌య్య‌!

By:  Tupaki Desk   |   4 Jan 2023 11:31 AM GMT
వైజాగ్..ఒంగోలు ద‌ద్ద‌రిల్లేలా వీర‌య్య‌...బాల‌య్య‌!
X
సంక్రాతి వార్ కి బాల‌య్య‌...వీర‌య్య త‌డాఖా చూపించ‌డానికి సంసిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒకరికొక‌రు పోటీగా ఒక్క‌రోజు గ్యాప్ లోనే'వాల్తేరు వీర‌య్య‌'...'వీర‌సింహారెడ్డి' రిలీజ్ అవుతున్నాయి. ఇప్ప‌టికే పోటాపోటీగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అందులో ఎక్క‌డా లోటు జ‌రిగినా అభిమానులు ఆడేసుకుంటున్నారు. వాళ్లే ద‌గ్గ‌రుండి మ‌రీ పోటీ పోటీగా ప్ర‌చారం చేయిస్తున్న స‌న్నివేశం క‌నిపిస్తోంది.

లిరిక‌ల్ సింగిల్స్..పోస్ట‌ర్స్ ...ఇత‌ర ప్ర‌చార చిత్రాలు ఏవైనా స‌రే బ్యాలెన్స్ గా వ‌దలాల్సిందే. ఎక్క‌డా ఎక్కువ‌..త‌క్కువ చేయ‌డానికి ఛాన్స్ లేదు. ఆర‌కంగా ఇంత వ‌ర‌కూ ప్ర‌చారం నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. ఇక తుది ఘ‌ట్టానికి రెడీ అవుతున్నారు. రెండు సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌బోతున్నారు. వైజాగ్ లో'వాల్తేరు వీర‌య్య‌'...ఒంగోలులో'వీర‌సింహారెడ్డి' వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

దీంతో అభిమానులు అభిమాన హీరోల్ని ఆయా ప్రాంతాల‌కు గ్రాండ్ గా వెల్కమ్ చేయ‌డానికి రెడీ అవుత‌న్నారు. బాల‌య్య అభిమానులు ఒంగోలు గ‌డ్డ‌పై కాలు పెట్ట‌గానే బైక్..కార్ ర్యాలీలు నిర్వ‌హించాల‌ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సాధార‌ణంగా బాల‌య్య ఈవెంట్లు ఎక్క‌డ జ‌రిగినా ర్యాలీలు స‌హ‌జంగానే చేస్తుంటారు. అయితే ఈసారి ఇంకా స్పెష‌ల్ గా ఒంగోలు ద‌ద్ద‌రిల్లేలా ప్లాన్ చేస్తున్నారుట‌.

ఇక వీర‌య్య అభిమానులు ..బాల‌య్య అభిమ‌నుల‌కు ధీటుగానే నిల‌బ‌డాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఒంగోలు ఈవెంట్ పూర్త‌యిన త‌ర్వాత ఎలా నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయి అప్ప‌టిక‌ప్పుడు స‌ర్వం సిద్దం చేసుకుని బ‌రిలోకి దిగుతార‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు బాబి ఇటీవ‌లే మెగా అభిమానుల‌సంఘాల‌తో కూడా స‌మావేశం కావ‌డంతో? ఈస‌న్నివేశం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ విష‌యాలు ఎలా ఉన్నా భారీ జ‌న‌సందోహంలో వీర‌య్య ఈవెంట్ మాత్రం గ్రాండ్ స‌క్సెస్ చేయ‌ల‌న్న‌ది మెయిట్ టార్గెట్. ఆ దెబ్బ‌కి వైజాగ్ ఉక్క ఎఫెక్ట్ వింట‌ర్ లోనూ తెలుస్తుంది.

మ‌రోవైపు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే రెండు సినిమాల ట్రైల‌ర్లు సిద్దం చేసి పెట్టిన‌ట్లు స‌మాచారం. కోడిపుంజుల్లా త‌ల‌పడేలా రెండు ట్రైల‌ర్లు రెడీ చేసిన‌ట్లు తెలుస్తుంది. తొలి నుంచి ప్ర‌చారంలో నిర్మాణ‌ సంస్థ భిన్న‌మైన స్ర్టాట‌జీని అనుస‌రిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.