Begin typing your search above and press return to search.

స‌మంత ఎంత సూప‌ర్ ఫిట్ అంటే..?

By:  Tupaki Desk   |   6 Aug 2018 4:32 AM GMT
స‌మంత ఎంత సూప‌ర్ ఫిట్ అంటే..?
X
స‌న్న‌జాజి మొగ్గ‌లా ఉండే స‌మంత ఎంత ధృడంగా ఉంటుందో.. శారీర‌కంగా ఆమె ఎంత సూప‌ర్ ఫిట్ అన్న విష‌యం తాజా ట్వీట్ ఒక‌టి చెబుతోంది. స‌మంత‌లోని కొత్త యాంగిల్ ను చెప్పుకొచ్చింది త‌మిళ్ వీడియో జాకీ ర‌మ్య‌. ఇటీవ‌ల ఆమె.. స‌మంత ఇద్ద‌రూ క‌లిసి తిరుమ‌ల కొండెక్కి స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌టం తెలిసిందే.

తిరుమ‌ల కొండ మీద‌కు ఎక్కిన సంద‌ర్భంగా తాము తీసుకున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ర‌మ్య ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని వెల్ల‌డించింది. తిరుమ‌ల కొండ మొత్తాన్ని రెండున్న‌ర గంట‌ల్లో ఎక్కేసిన‌ట్లుగా చెప్పింది. ఫిట్ నెస్ విష‌యంలో ర‌మ్య చాలా కేర్ ఫుల్ అన్న పేరుంది.

ఆమె.. స‌మంత‌ను సూప‌ర్ ఫిట్ గా కితాబు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. తిరుమ‌ల కొండ‌కు చేరుకోవ‌టానికి న‌డ‌క‌దారిలోని 3500 మెట్ల‌ను చాలా సులువుగా ఎక్కేయ‌ట‌మే కాదు.. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోకుండా కేవ‌లం రెండున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఎక్కిన‌ట్లుగా పేర్కొంది. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌టం చ‌క్క‌టి అనుభూతిగా ర‌మ్య పేర్కొంది. ఇటీవ‌ల కాలంలో స‌మంత తిరుమ‌ల‌కు రెగ్యుల‌ర్ విజిట‌ర్ గా మారిన వైనం తెలిసిందే. శారీర‌క ధృడ‌త్వం బాగా ఉన్న వారికి తిరుమ‌ల కొండ‌ను ఎక్కటానికి గంట‌న్న‌ర నుంచి రెండు గంట‌లు ప‌డుతుంద‌ని చెబుతారు. ఇలాంటి వారు రెగ్యుల‌ర్ గా కొండ‌ను ఎక్కే అల‌వాటు ఉంటుంది. అలాంటి వారితో పోటీ ప‌డేలా స‌మంత చాలా సుకుమారి కొండ‌ను అంత సులువుగా ఎక్కేయ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.