Begin typing your search above and press return to search.
సాహిత్యం తెలియనోళ్లు డైరెక్టర్లా?
By: Tupaki Desk | 25 Oct 2015 9:30 AM GMTబాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లో వచ్చినట్లుగా.. టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు రావడం లేదన్న మాట వాస్తవమే. దీనికి డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఓ చక్కని కారణం చెప్పాడు. హిందీలో కొత్త తరంలో వచ్చిన డైరెక్టర్లు, ముఖ్యంగా ఈ దశాబ్దంలో దర్శకులుగా అవతారమెత్తినవారు చక్కని సినిమాలతో ఆకట్టుకుంటున్నారని చెప్పాడు ఆదిత్య. ఈ స్థాయిలో తెలుగు సినిమాలు రాకపోవడానికి.. వారికి సాహిత్యంపై అవగాహన లేకపోవడమేనని అన్నాడాయన.
కనీసం న్యూస్ పేపర్ కూడా చదివే అలవాటు లేని వాళ్లు డైరెక్టర్స్ అయిపోతున్నారని.. దీంతో కేరక్టర్లు - వాటి ప్రవర్తనపై అవగాహన ఉండటం లేదన్నది ఆదిత్య ఆరోపణ. అంతే కాదు కథలు, నవలలు కూడా చదివడం లేదట చాలామంది డైరెక్టర్లు. అంతేకాదు కొరియన్ సినిమాలు కాపీ కొట్టేసి తీసేవారు ఎక్కువయిపోయారంటాడు ఆదిత్య.
ఈ డైరెక్టర్ చెప్పిన సంగతులు బాగానే ఉన్నాయి. ఎవరో కొందరు అలాంటి వారు ఉంటే ఉండొచ్చు కానీ.. మరి అంతటి సాహిత్యం మీద పట్టున్న ఈయన కూడా పెద్దగా సాధించినది ఏం లేదనే చెప్పాలి. డైరెక్టర్ గా 9 సినిమాలు తీస్తే.. అందులో చెప్పుకోదగ్గట్లుగా ఆడినది మనసంతా నువ్వే ఒక్కటే. తర్వాత ఏదీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఓ నాలుగేళ్లుగా అయితే సినిమాయే లేదు. అవతలివారిపై ఆరోపణలు చేసేముందు.. మరి ఈ విషయంపై కూడా కాస్త ఆలోచిస్తే బెటరేమో.