Begin typing your search above and press return to search.
జెర్సీ ఎఫెక్ట్ ఇంకా ఉంది
By: Tupaki Desk | 20 Jun 2019 11:10 AM GMTకమర్షియల్ గా భారీ స్థాయికి వెళ్ళలేదు కానీ న్యాచురల్ స్టార్ నాని జెర్సీకి పబ్లిక్ నుంచి క్రిటిక్స్ నుంచి దక్కిన ఆదరణ అపూర్వం. తండ్రి కొడుకుల ఎమోషన్ ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆవిష్కరించిన తీరుకి గత ఏడాదంతా హిట్టు లేని నానికి మంచి సక్సెస్ అందింది. కొడుకు జెర్సీ అడిగినందుకు ప్రాణాలు పణంగా పెట్టి క్రికెట్ ఆడిన తండ్రి కథను ఆధారంగా చేసుకుని ఇది రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా జీ 5 ద్వారా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అందుబాటులోకి వచ్చేసింది. జీ ఛానల్ లో ప్రసారం కూడా చేశారు.
సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఉన్న నాని సినిమా కాబట్టి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. అయితే జెర్సిలో కొడుకు నాన్నను కోరే కోరిక తరహాలో దర్శకుడు విఎన్ ఆదిత్యకు అలాంటి అనుభవమే ఎదురయ్యిందట. ఇటీవలే జెర్సీ సినిమా చూసాక ఆదిత్య వాళ్ళబ్బాయి నాన్న నువ్వెందుకు మళ్ళీ మూవీ తీయకూడదు అని అడిగాడట. వెంటనే తాను ఏం మిస్ అవుతున్నానో గుర్తించిన ఆదిత్య సోషల్ మీడియా వేదికగా త్వరలో ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.
ఈయన కెరీర్ లో మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. నాగార్జునతో తీసిన నేనున్నాను మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది. సిద్దార్థ్ ఆట ఉదయ్ కిరణ్ శ్రీరామ్ బాగానే పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ దక్కడంతో గ్యాప్ తీసుకున్న ఆదిత్య ఎట్టకేలకు కొడుకు కోరిక మేరకు మెగా ఫోన్ చేపడుతున్నారు. ఏమైనా జెర్సీ సినిమా ఇలా పిల్లల మీద ఇంత పాజిటివ్ గా ప్రభావం చూపడం విశేషమే.