Begin typing your search above and press return to search.

'లాక్ డౌన్'లో లాభం పొందుతుంది కేవలం వారేనట!!

By:  Tupaki Desk   |   31 July 2020 2:30 AM GMT
లాక్ డౌన్లో లాభం పొందుతుంది కేవలం వారేనట!!
X
కరోనా మహమ్మారి వలన ప్రపంచం మొత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుది. ప్రస్తుతం ఆర్థికంగా లాభాలు గడిస్తున్న రంగం సినీ పరిశ్రమలోని ఓటిటి రంగమే. ప్రపంచం మొత్తం సినీ షూటింగ్స్, థియేట్రికల్ విడుదలలు ఆగిపోయినప్పటికీ ఓటిటి ప్లాట్ ఫాములలో విడుదలలు మాత్రం ఆగడం లేదు. లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్న సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ఓటిటిలకు విపరీతంగా అలవాటు పడ్డారు. వారికి నచ్చిన సినిమాలు, షోలు, వెబ్ సిరీస్లు ఓటిటిలలో చూస్తున్నారు. ఇప్పటికే జనాలకు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్, వూట్, ఆహా, హాట్ స్టార్.. ఇలా అన్నింటిని సబ్ స్క్రయిబ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దెబ్బతో ఓటిటి ప్లాట్ ఫాములన్నీ కోట్లలో ఆదాయం వెనకేసుకుంటున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి పెద్ద ఓటిటిలు దాదాపు 5 నెలలకు సరిపడా కంటెంట్ సిద్ధంగా ఉంచుతున్నాయి.

కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. తెలుగు ప్రజలతో సహా భారతదేశంలోని అందరూ ప్రతి వారం కొత్త కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఏ భాషలో ఏది విడుదల అయినా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అంతెందుకు ఇటీవలే విడుదలైన హాలీవుడ్ చిత్రం “ది కిస్సింగ్ బూత్ 3” నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ మరియు తమిళ బాషలలో అందుబాటులో ఉంది. ఇక హైదర్‌బాద్, చెన్నైలో గల అన్ని డబ్బింగ్ స్టూడియోలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ల కొత్త ప్రాజెక్టులతో పాటు హాట్‌స్టార్, జీ5 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాయట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం, వెబ్ సిరీస్ స్థానిక భారతీయ భాషలలో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్టులు మాత్రమే కరోనా లాక్ డౌన్ వలన ఉపాధి పొందుతున్నారు. వారంతా కూడా కరోనాకు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ టైంలో కూడా పని కల్పించినందుకు అని సినీ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.