Begin typing your search above and press return to search.

#సేతుప‌తి .. ఆ ఒక్క లోప‌మే కాస్త‌ ఇబ్బంది!

By:  Tupaki Desk   |   16 Feb 2021 2:30 AM GMT
#సేతుప‌తి .. ఆ ఒక్క లోప‌మే కాస్త‌ ఇబ్బంది!
X
ఎంద‌రో గొప్ప త‌మిళ స్టార్లు తెలుగులో న‌టించారు. ఇక్క‌డ ఆడియెన్ ని మెప్పించారు. వారంతా సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకునేందుకు త‌పించారు కాబ‌ట్టి భాష ప్రాంతీయ అభిమానంతో సంబంధం లేకుండా ఇక్క‌డ మ‌రింత చేరువ‌య్యారు నాటి రోజుల్లో. కానీ ఇప్పుడు మ‌రో త‌మిళ స్టార్ అంతే చేరువ అయిపోతున్నాడు త‌న ప్ర‌తిభ‌తో. వ‌రుస‌గా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టిస్తూ ప్ర‌శంస‌లు పొందుతున్న విజ‌య్ సేతుప‌తి గురించే ఇదంతా.

ఇటీవ‌ల రిలీజైన మాస్ట‌ర్ .. ఉప్పెన లాంటి చిత్రాల్లో విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టించి మెప‌పించారు. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా సింపుల్ ఎక్స్ ప్రెష‌న్స్ తో గొప్ప‌ ప్ర‌భావం చూపే న‌టుడిగా సేతుప‌తి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇక ఉప్పెన‌లో విల‌న్ గా అత‌డి న‌ట‌న‌కు విప‌రీత‌మైన ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

ఉప్పెన చూసిన తర్వాత ఓ తెలుగు అభిమాని నుండి విజయ్ సేతుపతికి ఒక ప్రశంస ద‌క్కింది. ``క్లైమాక్స్ లో విజయ్ సేతుపతికి ఒక్క డైలాగ్ కూడా లేదు. అతను తన కళ్ళతో ఏం చేయాలో అది చేశాడు. నమ్మశక్యం కాని గొప్ప నటుడు!`` అన్న‌ ప్ర‌శంస అందుకున్నాడు. దీనిని బ‌ట్టి తెలుగులో అభిమానులు ఎంత‌గా ఆరాధిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. అతని సూక్ష్మ వ్యక్తీకరణలు బాడీ లాంగ్వేజ్ తెరపై ఎక్కువ కదలికల‌ తో ప‌ని లేకుండా గొప్ప‌ ప్రభావాన్ని క‌లిగిస్తాయ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

అందుకే అత‌డు తనకు సరిపోయే శాశ్వత డబ్బింగ్ వాయిస్ ‌ను కనుగొనవలసి ఉంటుంది. లేదంటే తనకు తానే స్వ‌యంగా డబ్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది త్వరలోనే సమస్యగా మారుతుంది. పెరుగుతున్న అసాధార‌ణ ఫాలోయింగ్ వ‌ల్ల‌.. అతని గ్రాఫ్ పెద్దదిగా మారుతోంది. ఇలాంట‌ప్పుడు డ‌బ్బింగ్ గొంతు స‌మ‌స్య కాకూడ‌ద‌ని సూచిస్తున్నారు నిపుణులు. త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటే మంచిద‌ని బావిస్తున్నారు