Begin typing your search above and press return to search.
శ్రీముఖి గెలుపుకోసం ఎంత పనిచేస్తున్నారు.
By: Tupaki Desk | 16 Oct 2019 5:39 AM GMTబిగ్ బాస్ చివరి అంకానికి చేరింది. మరో రెండు వారాల్లో ఈ షో ముగియబోతోంది. ఈ సోమవారం ఇంటిలోని మొత్తం ఏడుగురు సభ్యులను బిగ్ బాస్ నామినేట్ చేశాడు. మరో రెండు వారాల్లో ఇందులోంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతారు. ఫైనల్ లో కేవలం ఐదుగురు మాత్రమే ఉంటారు.
ఇంతటి క్లిష్ట సమయంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని ప్రతి ఒక్క కంటెస్టెంట్ బలంగా కోరుకుంటున్నారు. దాని తగ్గట్లే హౌస్ లో బీభత్సంగా గేమ్ ఆడుతున్నారు.
అయితే బిగ్ బాస్ లో ఉన్న అందరిలోకి అత్యధిక ఫాన్ ఫాలోయింగ్ యాంకర్ శ్రీముఖికి ఉంది. ఆమె పేరిట ఇప్పటికే శ్రీముఖి ఆర్మీ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోయినసారి ‘కౌశల్ ఆర్మీ’లా ఇది కూడా బిగ్ బాస్ ను శాసిస్తోంది.
అయితే తాజాగా శ్రీముఖి ఈ వారం నామినేషన్స్ లోకి రావడంతో ఆమె కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు ఆమె ఫ్యాన్స్. శ్రీముఖి గెలిపించమని ఏకంగా థియేటర్స్ లో యాడ్స్ వేయడం విశేషం. ‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ ఫోన్ నంబర్ తో సహా ఈ ప్రకటన ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తోంది. బిగ్ బాస్ విజేతగా శ్రీముఖిని నిలపాలని ఆమె టీమ్ తెగ కష్టపడుతోంది.
అయితే శ్రీముఖి కోసం ఏకంగా థియేటర్స్ లో యాడ్స్ వేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె హౌస్ లో మోనార్క్ లా ప్రవర్తిస్తోందని.. ఆమెకు ఎంత ప్రచారం చేసినా డబ్బులు వేస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి యాడ్స్ వల్ల ఆమెకు పడే ఓట్లు కూడా రావని అంటున్నారు. కానీ శ్రీముఖి ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే దీనికి కౌంటర్లు ఇస్తూ ప్రయత్నిస్తున్నారు.