Begin typing your search above and press return to search.

VT12: ఆ బడ్జెట్ లో యాక్షన్.. సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 1:30 PM GMT
VT12: ఆ బడ్జెట్ లో యాక్షన్.. సాధ్యమేనా?
X
గని అనే స్పోర్ట్స్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుణ్ తేజ్ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఫన్ అండ్ ప్రెస్టేజ్ అనే సినిమాతో వచ్చి ఓ మాదిరి హిట్ అందుకున్నాడు. సినిమా బాగోలేదని టాక్ వచ్చినా... కలెక్షన్స్ వర్షం కురిపించడంతో వరుణ్ తేజ్ కాస్తలో కాస్త రిలాక్స్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

తాజాగా వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గాండీవ దారి అర్జున అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు. అలాగే తుపాకీతో షూట్ చేస్తున్న వరుణ్ తేజ్ పాత్రను కూడా పరిచయం చేస్తున్న వ్యవహారం చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ ఆసక్తికరంగానే కనిపిస్తోంది.

ఇక ఈ టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టులు చూస్తే.. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. లండన్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా కనిపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా జరుగుతున్న మరో ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అదేమిటంటే ఇది ఒక భారీ యాక్షన్ మూవీ అని... కానీ బడ్జెట్ మాత్రం తక్కువ అని అంటున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ కి నిర్మాత ఇచ్చిన బడ్జెట్ 35 కోట్ల రూపాయలని అయితే... ప్రవీణ్ సత్తార్ గత అనుభవాల దృష్ట్యా ఆయన ఈ సినిమాని బడ్జెట్ లిమిట్ దాటకుండా పూర్తి చేయగలడా లేదా అనే అంశం మీద చర్చలు మొదలయ్యేలా చేసింది. గతంలో ప్రవీణ్ సత్తారు భారీ ప్రాజెక్టులు నిర్మించాడు. నాగార్జున వంటి వారితో కూడా ఆయన పని చేశాడు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా బడ్జెట్ లిమిట్ దాటకుండా పూర్తి చేయగలడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.