Begin typing your search above and press return to search.
తప్పు జరిగిపోయిందన్న వినాయక్
By: Tupaki Desk | 21 Dec 2015 3:54 AM GMTఅఖిల్ సినిమా గురించి తొలిసారి మీడియా ముందు స్పందించాడు దర్శకుడు వి.వి.వినాయక్. ఆ సినిమా ఫెయిలందని, అది నా తప్పే అని వినాయక్ తన మనసులో మాటని బయటపెట్టి బరువు దించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఒక్క రాజమౌళి తప్ప అందరూ ఏదో ఒక సందర్భంలో తప్పు చేసినవాళ్లమే అని, తొలిసారి అఖిల్ రూపంలో నేను తప్పు చేశానని వినాయక్ చెప్పుకొచ్చాడు. అఖిల్ సినిమా విడుదలయ్యాక చాలా రోజులపాటు వినాయక్ బయట కనిపించలేదు. చిరు 150వ సినిమా కోసమని మళ్లీ పనిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఏలూరులో జరిగిన ఓ ప్రైవైట్ కార్యక్రమానికి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనని చుట్టు ముట్టిన మీడియాతో వినాయక్ మనసువిప్పి మాట్లాడాడు.
అఖిల్ కథ కొత్తగా ఉందని ట్రై చేశామని, కానీ అది ఇంతగా బెడిసి కొడుతుందని ఊహించలేదని వినాయక్ స్పష్టం చేశాడు. భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో మాత్రం ఇలాంటి తప్పును జరగనీయని చెప్పాడు. అఖిల్ అక్కినేనిని మాత్రం ఆకాశానికెత్తేశాడు వినాయక్. అఖిల్ చాలా కష్టపడ్డాడనీ, అయితే మేమే అతని టాలెంట్ ని సద్వినియోగం చేసుకోలేకపోయామని స్పష్టం చేశాడు. అయితే వినాయక్ తప్పు జరిగిందన్నాడు కానీ... స్పెసిఫిక్ గా ఎక్కడ తప్పు జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. కథలోనే లోటుపాట్లున్నాయనేది వినాయక్ మాటల్నిబట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం చిరు 150వ సినిమాగా కత్తిని రీమేక్ చేసే పనిలో పడ్డారు వినాయక్.