Begin typing your search above and press return to search.
ఫ్లాప్ హీరో మీద అంత బడ్జెట్టా?
By: Tupaki Desk | 29 Jan 2018 4:14 AM GMTతొలి సినిమా ‘రేయ్’ చేదు అనుభవాన్ని మిగిల్చినా.. ఆ తర్వాత ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లతో తన మార్కెట్ పెంచుకున్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ అక్కడి నుంచి తర్వాతి దశకు చేరుకుంటాడని అనుకుంటే.. వరుస ఫ్లాపులతో తిరోగమన బాట పట్టాడతను. ‘తిక్క’.. ‘విన్నర్’.. ‘నక్షత్రం’.. ‘జవాన్’ తేజుకి నిరాశని మిగిల్చాయి. హ్యాట్రిక్ హిట్లతో వచ్చిన మార్కెట్టంతా ఈ ఫ్లాపులతో పోయింది. ఇలాంటి టైంలో తేజు సినిమా మీద రూ.32 కోట్ల బడ్జెట్ పెట్టడమంటే సాహసమే. ఐతే సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఆ సాహసమే చేశాడట. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తేజు నటించిన ‘ఇంటిలిజెంట్’ బడ్జెట్ రూ.32 కోట్లని వార్తలొస్తున్నాయి.
వినాయక్ ఏ హీరోతో చేసినా బాగా ఖర్చు చేయిస్తాడని పేరు. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కొత్త హీరోను పరిచయం చేస్తూ కూడా ‘అల్లుడు శీను’కు రూ.35 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టించాడు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ‘అఖిల్’ అంత పెద్ద డిజాస్టర్ అయిందన్నా బడ్జెట్ వల్లే. దెబ్బ తిన్న సాయిధరమ్ తేజ్ మార్కెట్ గురించి పట్టించుకోకుండా ‘ఇంటిలిజెంట్’ మీద కూడా అలాగే బడ్జెట్ పెట్టించినట్లు సమాచారం. రీమేక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ను పక్కన పెడితే.. వినాయక్ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలమైంది. పైగా ఇప్పుడు వినాయక్ మార్కు మాస్ సినిమాలకు అంతగా ఆదరణ ఉండట్లేదు. మరోవైపు తేజు మార్కెట్ చూస్తే డౌన్ అయింది. ఇవన్నీ చాలవన్నట్లు సినిమాలకు కలెక్షన్లు తక్కువగా ఉండే ఫిబ్రవరిలో.. మరో మూడు సినిమాల పోటీ మధ్య రిలీజవుతోంది ‘ఇంటిలిజెంట్’. ఈ పరిస్థితుల్లో ఆ బడ్జెట్ రికవరీ సాధ్యమేనా అన్నది ప్రశ్న.